Saturday, September 13, 2025 09:27 AM
Saturday, September 13, 2025 09:27 AM
roots

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త…!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ఎదురు చూస్తున్న శ్రీవారి భక్తులకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. గతంలో వైకుంఠ ద్వార దర్శనం కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే గత ఐదేళ్లుగా వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు భక్తులకు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. దీంతో స్వామి వారిని దర్శించుకున్న భక్తులు… ఆలయంలోని వైకుంఠ ద్వారం నుంచి నేరుగా హుండీ దగ్గరకు వస్తారు. ఏడాదిలో కేవలం పది రోజులు మాత్రమే వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకుంటారు.

Also Read : సార్… ప్లీజ్ ఆ ఆఫీసు మాకొద్దు…!

జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పండుగ. ఆ తర్వాత 11వ తేదీన ద్వాదశి. జనవరి 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం అందుబాటులో ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. పది రోజుల పాటు ఎలాంటి సిఫారసు లేఖలకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది. అలాగే సంక్రాంతి పండుగ కూడా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి తర్వాత రెండు రోజులకే రావడంతో… భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లను ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు 10 రోజుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనం… రూ.300 టికెట్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు పది రోజుల కోటాను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే తిరుపతిలో 8 కేంద్రాల్లో కూడా పది రోజుల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయిస్తారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని… టోకెన్ లేని భక్తులు తిరుమలకు వచ్చినా సరే… క్యూ లైన్‌లోనకి అనుమతించరని ఈవో తెలిపారు.

Also Read : శిరీష చేసింది నేరం అయితే మీరు చేస్తున్నది ఏంటి..?

వైకుంఠ ఏకాదరి రోజున ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు. ఇక ఏకాదశి రోజున ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుంచి 6.30వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాం నిర్వహిస్తారు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదని తేల్చి చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాదారు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. అలాగే క్యూ లైన్‌లోని భక్తులకు టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేయనున్నారు. ఇక లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా… ప్రతిరోజూ అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు, అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్