Wednesday, February 4, 2026 09:40 AM
Wednesday, February 4, 2026 09:40 AM

50 శాతం సుంకాలపై ట్రంప్ కు షాక్..?

రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తోందనే కారణంతో భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగి.. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 50% వరకు సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అమెరికాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని ముగ్గురు సభ్యుల అమెరికా ప్రతినిధుల సభ వ్యతిరేకిస్తోంది. దీనిని రద్దు చేసేందుకు ఓ తీర్మానం కూడా ప్రవేశ పెట్టడం గమనార్హం. ఈ తీర్మానం అమెరికన్ కార్మికులు, వినియోగదారులు, ద్వైపాక్షిక సంబంధాలకు హాని కలిగిస్తుందని సభ పేర్కొంది.

Also Read : జట్టులోనే పనికిరాని వాడ్ని కెప్టెన్ చేస్తారా..?

భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి నేతృత్వంలోని చట్టసభ్యులు, ఈ చర్యలు చట్టవిరుద్ధమైనవిగా అభివర్ణించారు. ప్రతికూల ఉత్పాదకత కలిగి ఉన్నాయని, సప్లై చైన్ ను దెబ్బ తీసే అవకాశం ఉందని, వినియోగదారుల ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతినిధులు డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి నేతృత్వంలోని సభ ఈ తీర్మానం ప్రవేశ పెట్టింది. ఆగస్టు 27, 2025న భారత్ పై విధించిన అదనపు 25 శాతం ద్వితీయ సుంకాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

Also Read : బ్రెస్ట్ క్యాన్సర్ టీకాలో సంచలన అడుగు..!

అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద అనేక భారత సంతతి ఉత్పత్తులపై సుంకాలను 50 శాతానికి పెంచాయి. అమెరికా ప్రజలు భారత ఉత్పత్తులను గత దశాబ్ద కాలంగా ఎక్కువగా వినియోగిస్తున్నారని, ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం కరెక్ట్ కాదని సభ్యుల్లో ఒకరైన రాస్ అభిప్రాయపడ్డారు. నార్త్ కరోలినాలో భారత కంపెనీలు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయని, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ వంటి రంగాలలో వేలాది ఉద్యోగాలను కల్పిస్తున్నాయని, నార్త్ కరోలినా తయారీదారులు ఏటా వందల మిలియన్ల డాలర్ల వస్తువులను భారతదేశానికి ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. భారత్ ఒక ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక మరియు వ్యూహాత్మక భాగస్వామిగా ఆమె కొనియాడారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్