అమెరికా అధ్యక్షుడు పదే పదే భారత్ విషయంలో చేస్తోన్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు, ఆపరేషన్ సిందూర్ విషయంలో కాల్పుల విరమణ ఒప్పందం సహా పలు అంశాలపై పదే పదే ట్రంప్ రెచ్చగొట్టే తరహాలో వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేసారు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపుతుందని, తన బెదిరింపులకు భారత్ భయపడింది అంటూ ట్రంప్ తాజాగా వ్యాఖ్యలు చేసారు.
Also Read : డీఎంకే నేతలతో కలిసి వైసీపీ కల్తీ వ్యాపారం..?
ఉక్రెయిన్ లో జరుగుతోన్న యుద్ధంలో భాగంగా రష్యాను చర్చల దారిలోకి తీసుకురావడానికి తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సంవత్సరం చివరి నాటికి భారత్.. రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన సమావేశంలో వైట్ హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసారు. దిగుమతులు తగ్గడం ఖాయమని, క్రమంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు.
Also Read : దానం చుట్టూ మరో వివాదం..!
తనకు భారత్ హామీ ఇచ్చిందని, దశల వారీగా తగ్గిస్తామని చెప్పినట్టు ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్ లో గందరగోళం లేకుండా ఉండేందుకు దశల వారీగా తగ్గిస్తామని భారత్ చెప్పింది అన్నారు ట్రంప్. ఈ వారం ప్రారంభంలో, రష్యా నుండి చమురు కొనుగోలును ఆపకపోతే భారత్ నిరంతర సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. చమురు దిగుమతి చేసుకుంటే, సుంకాలు కడుతూనే ఉంటారని అన్నారు ట్రంప్. కాని భారత్ అలా చేయదని తాను నమ్ముతున్నానని అన్నారు ట్రంప్.