Monday, October 27, 2025 09:02 PM
Monday, October 27, 2025 09:02 PM
roots

అమెరికా దాటుతున్నారా.. పాస్‌పోర్ట్ జాగ్రత్త..!

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో వలసదారులపై విధిస్తున్న షరతులు కంగారు పెడుతున్నాయి. ముఖ్యంగా భారత్ ఈ విషయంలో ఎక్కువ కలవర పడుతోంది. భారత్ నుంచి లక్షలాదిమంది అమెరికాకు విద్యార్థుల రూపంలో ఉద్యోగస్తుల రూపంలో వలస వెళ్లారు. వీరిలో చాలామంది గ్రీన్ కార్డు కూడా పొందారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా ప్రజలకే ప్రాధాన్యత ఇవ్వాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేయడంతో ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్లలో కూడా భయం మొదలైంది.

Also Read: చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. జగన్ కోటకు బీటలు..!

గ్రీన్ కార్డు ఉంటే శాశ్వతంగా అమెరికాలో ఉండి పోవడం కాదనే విషయాన్ని ఇటీవల ఆదేశం ఉపాధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇక గ్రీన్ కార్డుతో పాటుగా స్టూడెంట్ వీసా అలాగే హెచ్ 1 బి ఉన్నవాళ్లు.. అమెరికా నుంచి వెళ్లే సమయంలో తిరిగి వచ్చే సమయంలో సరైన పత్రాలు ఉండాల్సిందేనని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక తనిఖీలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండటంతో స్టాంపింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికా దాటి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని, ఎమన్నా ఏమరుపాటుగా వ్యవహరిస్తే వీసా రద్దు కావడం ఖాయం అంటున్నారు నిపుణులు.

Also Read: చంద్రబాబుకు, జగన్‌కు అదే తేడా..!

కాబట్టి అమెరికా నుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రావాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని.. పే స్లిప్పులతో పాటుగా ప్రతి ఒక్క పత్రాన్ని జాగ్రత్త పరుచుకోవాలని హెచ్చరిస్తున్నారు. దానికి తోడు కస్టమ్స్ అధికారులు అలాగే బోర్డర్ అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. గత 15 ఏళ్లలో గ్రీన్ కార్డు పొందిన వారిపై ఎక్కువగా అమెరికా అధికారులు ఫోకస్ పెడుతున్నారు. ఇక అలాగే చదువుకోడానికి వెళ్ళిన వాటితో పాటుగా హెచ్ 1 బీ వీసా ఉన్నవాళ్లు తమ సొంత దేశ పాస్పోర్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అమెరికా హెచ్చరిస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్