Saturday, September 13, 2025 02:48 AM
Saturday, September 13, 2025 02:48 AM
roots

వాళ్ళు అమెరికా వదిలేయాల్సిందేనా…? సంచలనంగా ట్రంప్ నిర్ణయం…!

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి వాతావరణం కాస్త హాట్ హాట్ గానే కనపడుతోంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన మొదలైంది. సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు డిపెండెంట్ లకు చుక్కలు చూపించేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై గురి పెట్టిన ట్రంప్.. వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలో ఉండే వారిపై ఎక్కువగా ఫోకస్ పెట్టేసారు.

Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్…!

వీరిలో ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ట్రంప్ వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడే అవకాశం కనపడుతోంది. హెచ్1బీ వీసా పొందిన వారిపై ఆధారపడిన వారు అంటే… వారి పిల్లలు డిపెండెంట్ వీసా-హెచ్4 కింద అమెరికాకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడకు వెళ్లిన మైనర్లకు 21 ఏళ్లు వచ్చే వరకు ఈ వీసా వర్క్ అవుతుంది. అక్కడి నుంచి రెండేళ్ళు సమయం ఇస్తారు. ఆ లోపు కొత్త వీసా ఇస్తారు. డిపెండెంట్ వీసాపై వెళ్లిన లక్షా 34 వేల మంది భారతీయుల వీసాల గడువు అయిపొయింది.

Also Read : భారత్ ఆ ఇద్దరినీ ఆపుతుందా…?

దీనితో వీసా గడువు ముగిసిన వారు తట్టా బుట్టా సర్దుకుని ఇండియా రావాల్సిందే అనే సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒక అవకాశం ఉంది. వీసా గడువు ముగిసే వాళ్లు ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసా ఎఫ్-1కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాని ఇది కూడా ఇప్పుడు అక్కడ కష్టంగానే కనపడుతోంది. స్టూడెంట్ వీసా పొందితే.. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదు చేస్తారు. ఇలా జరిగితే ఫ్యూచర్ లో స్కాలర్‌షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి వారు అర్హులు కాదు. దీనితో వారు ఇండియా తిరిగి రావడమే ఏకైక ఆప్షన్ అంటున్నారు నిపుణులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్