భారత్ పై పదే పదే కక్ష సాధింపు చర్యలకు దిగుతోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మరోసారి భారత్ పై మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన తర్వాత డొనాల్డ్ ట్రంప్, భారత్ పై కొత్తగా అదనపు సుంకాలను విధిస్తారా అనే ప్రశ్న వినపడుతోంది. ఫిబ్రవరిలో చైనాపై అమెరికా 34% సుంకం విధించిన తర్వాత.. అమెరికాపై 15% పన్ను విధించింది చైనా. అలా భారత్ కూడా చర్యలకు దిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
Also Read : ఏపీ బార్ పాలసీ ఫెయిల్.. ఆసక్తి చూపని వ్యాపారులు.. కారణం అదేనా..?
జైశంకర్ రష్యా విదేశాంగ శాఖా మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ను, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను కలిసిన తర్వాత ట్రంప్ పై విమర్శలు చేసారు. ఇదే సమయంలో అంత ఇబ్బందిగా ఉంటే భారత్ నుంచి ఉత్పత్తులను కొనవద్దు అంటూ హెచ్చరించారు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు ఆగే ప్రసక్తే లేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చేసారు. దీనితో ట్రంప్ సర్కార్ మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. చమురు కొనుగోలుతో పాటుగా.. రష్యా వాణిజ్య ఒప్పందాన్ని మరింత విస్తరించే అవకాశం ఉండవచ్చు.
Also Read : జగన్ తిరుమలకు రావొద్దు.. వైసీపీలో అంతర్గత తిరుగుబాటు
అమెరికా గనుక భారత ఉత్పత్తులను కొనడం ఆపేస్తే.. తాము కొనడానికి సిద్దంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. అటు చైనా కూడా భారత్ తో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనితో ట్రంప్ సర్కార్ భారత్ పై మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గత వారం రెండు మిలియన్ బ్యారెళ్లకు పైగా అమెరికా చమురును కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం అయింది. ఇది ఖచ్చితంగా అమెరికాను బుజ్జగించడమే అంటున్నారు విదేశాంగ నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.