దక్షిణాసియా దేశాలతో అమెరికా కయ్యం కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు భారత్ విషయంలో కవ్వింపు చర్యలకు పాల్పడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనాపై ఫోకస్ చేసారు. చైనాకు భారీగా సుంకాలు విధిస్తా అంటూ ట్రంప్ సర్కార్ బెదిరింపులకు దిగుతోంది. అరుదైన ఖనిజ వనరుల విషయంలో చైనా కఠినంగా వ్యవహరించడంతో ట్రంప్ సర్కార్.. 500 శాతం వరకు సుంకాలు విధించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై చైనా కూడా అదే స్థాయిలో ఆన్సర్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది.
Also Read : రాజకీయాలకు మరో సీనియర్ నేత గుడ్ బై..!
అక్టోబర్ 31న దక్షిణ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) ఫోరమ్ సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్.. చైనా అధ్యక్షుడు.. జి జిన్‌పింగ్‌ను కలిసే అవకాశం ఉంది. అయితే, చైనాకు విధించే సుంకాల విషయంలో వెనక్కు తగ్గేది లేదని వైట్ హౌస్ అంటోంది. పార్టీలకు అతీతంగా, 85 మంది యూఎస్ సెనెటర్లు దీనికి మద్దతు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. చైనాపై 500% వరకు సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కు ఇవ్వడానికి 85 మంది అమెరికా సెనెటర్లు సిద్ధంగా ఉన్నారు.
Also Read : ఎన్టీఆర్ కు ఏమైంది..? ఫ్యాన్స్ లో కంగారు..!
అమెరికా సుంకాలు అమలు చేస్తే మాత్రం ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా సరఫరా చైన్ పై దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. అయితే చైనా కూడా ప్రతీకారం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఇది అమెరికాపై కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన చైనా.. భారత్ కు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చింది. ఈ తరుణంలో చైనాను భయపెట్టే దిశగా ట్రంప్ సర్కార్ అడుగులు వేస్తోంది.