Tuesday, October 28, 2025 02:17 AM
Tuesday, October 28, 2025 02:17 AM
roots

ఇరాన్ కు వణుకుతున్న ట్రంప్.. సైనికులు వెనక్కే

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆసియా దేశాలతో ఆయన వైఖరిపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాల విషయంలో ట్రంప్ సర్కార్ ముందు నుంచి డ్రామాలు ఆడుతోంది అనే ఆరోపణలు వింటూనే ఉన్నాం. ఇటీవల 12 దేశాల పౌరులపై తమ దేశంలోకి ట్రంప్ సర్కార్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రాచ్యం ప్రమాదకరమైన ప్రదేశం కాబట్టి అమెరికా సిబ్బందిని అక్కడి నుండి తరలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు.

Also Read : టార్గెట్ ఏపీఎస్ ఆర్టీసీ.. ఎందుకీ నిర్లక్ష్యం..!

ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటానికి అమెరికా అనుమతించదని స్పష్టం చేసారు. అమెరికా, ఇరాకీ వర్గాల సమాచారం ప్రకారం, అమెరికా తన ఇరాకీ రాయబార కార్యాలయాన్ని పాక్షికంగా ఖాళీ చేయడానికి సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మధ్యప్రాచ్యం చుట్టూ ఉన్న దేశాల నుండి సైనికులను వెనక్కు తీసుకు రావాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల భద్రతా ప్రమాదాలు ఏంటి అనేది మాత్రం అమెరికా బయటపెట్టలేదు. ఇక ఒపెక్ దేశాలు చమురు ధరలను 4 శాతానికి పైగా పెంచాయి.

Also Read : తెలంగాణలో బాబు, పవన్ ఎంట్రీ.. లైన్ క్లియర్

బహ్రెయిన్ మరియు కువైట్ నుండి స్వచ్ఛందంగా బయలుదేరడానికి విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చిందని అమెరికా అధికారి ఒకరు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన కారణంగా జూన్ 11న, అత్యవసర పరిస్థితులు లేని అమెరికా ప్రభుత్వ సిబ్బందిని వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ తమ దేశ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికోట్టినట్టు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : అమరావతి రైతులపై దాడి చేయమన్నాడు.. బాంబు పేల్చిన కోటంరెడ్డి

ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనితోనే తమ దేశ పౌరుల విషయంలో ట్రంప్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో స్థావరాలతో, ప్రధాన చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో అమెరికా సైనికులు పెద్ద ఎత్తున ఉన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్