అమెరికా ఎన్నికల్లో విస్తృత మార్పులు తీసుకురావాలని భావిస్తున్న.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై చేసిన సంతకం సంచలనంగా మారింది. ఓటర్లు తాము అమెరికన్ పౌరులని నిరూపించుకోవాల్సిందే అని తప్పనిసరి చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎన్నికల రోజు నాటికి వచ్చిన మెయిల్ లేదా గైర్హాజరు బ్యాలెట్లను మాత్రమే లేక్కించాలని నిర్ణయించారు. అమెరికాయేతర పౌరులు కొన్ని ఎన్నికలలో విరాళం ఇవ్వకుండా నిషేధించడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
Also Read : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చెన్నై..
భారత్ సహా కొన్ని ఇతర దేశాలను ఉదాహరణలుగా ఉటంకిస్తూ, ఆధునిక, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉపయోగించే ప్రాథమిక, అవసరమైన ఎలక్షన్ సెక్యూరిటీ వ్యవస్థను అమలు చేసే విషయంలో అమెరికా విఫలమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్, బ్రెజిల్ ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్ తో అనుసంధానిస్తున్నాయి, అయితే యునైటెడ్ స్టేట్స్ ఎక్కువగా పౌరసత్వం కోసం స్వీయ-ధృవీకరణపై ఆధారపడుతుంది అని ఆయన అసహనం వ్యక్తం చేసారు.
Also Read : వాట్సాప్ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జర్మనీ, కెనడా ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్లను తీసుకుంటాయని.. అయితే యునైటెడ్ స్టేట్స్ రక్షణ లేని వ్యవస్థలతో ఎన్నికలను నిర్వహిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. డెన్మార్క్, స్వీడన్ వంటి దేశాలు.. సముచితంగా” వ్యక్తిగతంగా ఓటు వేయలేని వారికి మెయిల్-ఇన్ ఓటింగ్‌ను పరిమితం చేస్తున్నాయని, పోస్ట్ మార్క్ తేదీతో సంబంధం లేకుండా ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించవని ట్రంప్ పేర్కొన్నారు. చాలా మంది అధికారులు పోస్ట్ మార్క్ లు లేని బ్యాలెట్‌లను లేదా ఎన్నికల రోజు తర్వాత స్వీకరించిన వాటిని అంగీకరిస్తున్నారని మండిపడ్డారు.




