Saturday, February 21, 2026 04:23 AM
Saturday, February 21, 2026 04:23 AM

భారత్ పై ట్రంప్ మరోసారి సంచలన కామెంట్..!

భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత ఏడాది చేసుకుంటున్న ప్రచారం అనేక వివాదాలకు దారి తీస్తోంది. తాజాగా మరోసారి ఆయన రెండు దేశాల మధ్య గొడవలను ఆపా అంటూ చెప్పుకునే ప్రయత్నం చేసారు. 2025 లో సైనిక ప్రతిష్టంభన సమయంలో భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం వహించానని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య పోరాటాన్ని ఆపకపోతే 200 శాతం సుంకాలు విధిస్తామని తాను బెదిరించానని చెప్పారు ట్రంప్.

Also read : వీకెండ్ లో యుద్దమే..? రెడీ అయిన ట్రంప్..!

తన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు ట్రంప్. ఈ సమయంలో 11 జెట్ విమానాలను కూల్చినట్లు కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో ఏడు జెట్లు కూల్చేశారు అని కామెంట్ చేసిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా 11 కూల్చారన్నారు. రెండు దేశాల మధ్య సమస్యను పరిష్కరించడం ద్వారా.. తాను 10 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడాను అంటూ ఈసారి ట్రంప్ కాస్త స్పీడ్ పెంచి కామెంట్ చేసారు.

Also read : వైసీపీ దుష్ప్రచారానికి సుందర్ పిచాయ్ చెక్!

శాంతి ఒప్పందం కుదుర్చడానికి.. తన సుంకాల విధానాన్ని ఉపయోగించుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు. వారి ఇద్దరితో ఫోన్ లో మాట్లాడానని.. ప్రధాని నరేంద్ర మోడీకి తనకు మంచి పరిచయం ఉందన్నారు. ఈ వివాదం పరిష్కారం కాకపోతే.. వాణిజ్య ఒప్పందాలు చేసుకునేది లేదని తాను హెచ్చరించాను అని, పాకిస్తాన్ అధ్యక్షుడితో కూడా తనకు కొంచెం పరిచయం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. వాళ్ళు కూల్చిన జెట్ లు కూడా చాలా ఖరీదైన జెట్ లు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆఫ్ ది రికార్డు...

ఆఫ్ ది రికార్డు అంటూ మీడియాలో...

ఆ విషయంలో టార్గెట్...

మంత్రి నారా లోకేష్ శ్రీలంక పర్యటనపై...

పరారీలో వైసీపీ ఎమ్మెల్సీ..!

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో...

బొత్సకు లోకేష్ అదిరిపోయే...

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లడ్డూ రాజకీయం...

బ్రేకింగ్: అనంతబాబు కేసులో...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సంచలనం...

సోషల్ మీడియాలో జగన్...

అన్నొస్తున్నాడు.. అందరికీ మంచి జరుగుతుంది.. అనేది...

పోల్స్