Saturday, September 13, 2025 01:25 AM
Saturday, September 13, 2025 01:25 AM
roots

సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కైన రోజా

పాపం… మాజీ మంత్రి ఆర్కే రోజాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కాలం చేస్తున్న తప్పుడు ప్రచారం అయితే కాదు. రోజా నాడు – నేడు అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ట్రోలర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ గా రోజాకు పేరు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన రోజా… చాలా తక్కువ సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ మరణానంతరం జై జగన్ అనేశారు రోజా.

వైసీపీలో చేరిన తర్వాత ప్రతిరోజు టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014లో నగరి నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో రోజాకు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా అధికార పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రోజా. చివరికి సాటి మహిళలపై కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేసి అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. ఆ సమయంలో కూడా మహా అయితే ఇంకేం చేస్తారు… రేప్ చేయలేరు కదా అంటూ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

Also Read : భారత్ పై కెనడా కుట్రలు ఆపదా..?

మంత్రిగా ఉన్నప్పుడు కూడా రోజా ఇదే తరహా నోటి దూల ప్రదర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరిలో నన్ను ఓడించే దమ్ము లేదు అంటూ టిడిపి నేతలకు సవాల్ కూడా విసిరారు. అయితే గత ఎన్నికల్లో రోజా ఘోరంగా ఓడిపోయింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా ఏపీకి దూరమయ్యారు. అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తో కనిపించినప్పటికీ…. అది మొక్కుబడిగానే సమావేశమయ్యారు.

తాజాగా చిత్తూరు జిల్లాలో బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై రోజా స్పందించిన తీరు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. బాలిక కుటుంబ సభ్యులకు జగన్ మాదిరిగా తల నిమురుతూ ఓదార్చరు రోజా. అయితే సరిగ్గా రెండు నెలల క్రితం తమిళనాడులోని ఓ దేవస్థానానికి వెళ్లిన రోజా అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో వ్యవహరించిన తీరు ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఫోటో కోసం వచ్చిన మహిళలను దూరంగా ఉండాలంటూ సైగ చేసింది రోజా. కానీ చిత్తూరు ఘటనలో మాత్రం దగ్గరికి తీసుకోవడం పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శవ రాజకీయాలు చేయడంలో మీకు మీరే సాటి అంటూ ట్రోలర్స్ రోజా రెండు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్