గత ఆరేళ్ళ నుంచి ఏదైనా వైరస్, వ్యాధి ఇలా ఏదైనా మాట వింటే ప్రజల్లో భయాలు ఓ రేంజ్ లో వణికిస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఏ వైరస్ బయటకు వస్తుందో అర్ధం కాక గుండె గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. తినాలన్నా, తాగాలన్నా, ఎదుటి వారితో మాట్లాడాలన్నా సరే భయంగానే ఉంటుంది. కరోనా తర్వాత ఆరోగ్య పరిస్థితి కూడా చాలా మందిలో మార్పు వచ్చింది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గడంతో జ్వరాలు, ఇతర సమస్యలు రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. ఈ టైం లో కొన్ని వైరస్ లు భయపెట్టాయి.
Also Read: దేశానికి గుండెకాయ ఈ రైల్వే స్టేషన్..!
ఎప్పుడో వినపడిన ఎబోలా వైరస్, ఆ తర్వాత మంకి ఫాక్స్ అలియాస్ ఎం ఫాక్స్, నిఫా వైరస్ సహా కొన్ని వైరస్ ల దెబ్బకు ప్రజలు కంగారు పడ్డారు. ఇక ఇప్పుడు మధ్య భారతంలో ఓ వైరస్ మాట వినపడుతోంది. అదే టమాటా వైరస్. మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ కలకలం రేగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్నారుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీనితో రాజధాని భోపాల్ లో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్కూల్ యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
Also Read: కొబ్బరి నీళ్ళు తాగితే బరువు తగ్గుతారా..?
ఈ లక్షణాలు కూడా కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు.. దురద, మంట, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు బాధితుల్లో కనపడుతున్నాయి. హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ గా పిలుస్తున్న వైద్యులు.. చేతుల పరిశుభ్రత పాటించకపోవడంతో వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేసారు. తుమ్మినా, దగ్గినా నోటి తుంపర్లతో వ్యాపిస్తున్న వైరస్ పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి సోకినవారిని ఇంటివద్దే ఉంచాలని సూచిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన చికిత్స లేదని, సాధారణ సమస్య మాత్రమే అంటున్నారు. అవగాహన అవసరమని, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.