Friday, September 12, 2025 05:32 PM
Friday, September 12, 2025 05:32 PM
roots

ప్రేమ పెళ్ళిళ్ళకి సిద్దమైన టాలీవుడ్ టాప్ యాక్టర్స్ వీళ్ళే

టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సందడి నడుస్తోంది. స్టార్ హీరోలు నుంచి చిన్న హీరోల వరకు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని.. సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. మన తెలుగులో కిరణ్ అబ్బవరం ఇప్పటికే పెళ్లి చేసుకున్నాడు. ఇక నాగ చైతన్య త్వరలోనే రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ వివాహం అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరగనుందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ శుభలేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Also Read : పారితోషికం లోనూ అన్ స్టాప‌బుల్ గ దూసుకెళ్తున్న బాలయ్య

ఇక హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పెళ్లి పీటలు ఎక్కనుంది. తన ప్రియుడు ఆంటోని తటిల్ ను ఆమె వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో ఈ వివాహం జరగనుందని తెలుస్తుంది. ఇప్పటికే కీర్తి తండ్రి కూడా ఈ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా వివాహానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన క్లోజ్ ఫ్రెండ్ ను ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వివాహం చేసుకుంటున్నట్టు టాక్. ఇక మన తెలుగు హీరో విజయ్ దేవరకొండ కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read : మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..?

రష్మిక మందన్నతో ఆయన వివాహం ఖరారు అయిందనే ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ చిట్ చాట్ లో విజయ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తనకు 35 ఏళ్ళు వచ్చాయని, తాను సింగిల్ కాదని ఆల్రెడీ ఒకరితో రిలేషన్ లో ఉన్నాను అన్నాడు. దాదాపుగా ఆమె రష్మిక మందన్ననే అయి ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్. చాన్నాళ్ళ పాటు స్నేహం చేసిన తర్వాతనే తాను వాళ్ళతో ప్రేమలో పడతా అని అన్నాడు. దీంతో రష్మిక మందన్నతోనే ప్రేమలో ఉన్నాడనేది క్లారిటీ వచ్చింది ఫ్యాన్స్ కు. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుంది. ఇప్పుడు హీరోయిన్స్ పెళ్లి చేసుకుని సినిమాలు చేస్తున్నారు. నయనతార, కాజల్, దీపిక ఇలా పెళ్లి తర్వాత కూడా మంచి సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు పెళ్లి సినిమాలకి అడ్డంకి కాదు అని నిర్ణయించుకుని పెళ్లి పీటలు ఎక్కడడానికి సిద్ధం అవుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్