Friday, September 12, 2025 05:18 PM
Friday, September 12, 2025 05:18 PM
roots

అల్లు ఫ్యామిలీపై టాలీవుడ్ పెద్దల ఒత్తిడి..? అల్లు Vs దిల్ రాజు..!

తెలుగు సినిమా పరిశ్రమలో శనివారం శాసన సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగానే కనపడుతుంది.. పుష్ప సినిమా వ్యవహారంతో బెనిఫిట్ షోలకు, అలాగే టికెట్ ధరలు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేది లేదు అనే క్లారిటీ నేపథ్యంలో సినిమా పరిశ్రమ పెద్దలు ఇప్పుడు సీరియస్ గా ఉన్నారు. రాబోయే కాలంలో అన్ని భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సినిమా పరిశ్రమ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ ధరల విషయంలో ముందడుగు వేసే అవకాశాలు లేకపోవచ్చు అనే స్పష్టత వస్తుంది.

Also Read: దిల్ రాజు టార్గెట్ పుష్ప.. రామ్ చరణ్ వర్కౌట్ అదే

బెనిఫిట్ షోల విషయంలో భారీ బడ్జెట్ సినిమాలు చాలా ఆశలు పెట్టుకుంటాయి. సినిమా రిజల్ట్ కంటే కూడా ఆ రోజు వచ్చే వసూళ్లు నిర్మాతలను కాస్త కూస్తో నష్టాల నుంచి బయట పడేస్తాయి. అందుకే బెనిఫిట్ షో విషయంలో కాస్త పట్టుదలగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే పుష్ప సినిమా చేసిన రాద్ధాంతంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలగా ఉంది. దీనితో సినిమా పరిశ్రమ పెద్దలు.. అల్లు ఫ్యామిలీ పై మండిపడుతున్నారు. చిన్న సినిమాలకు కూడా ఇది ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సినిమా పరిశ్రమ పెద్దలు ఉన్నారు.

 

Allu Arjun Allu Aravind
Allu Arjun Allu Aravind

 

ఇప్పటికే టాలీవుడ్ లో దిల్ రాజు వర్సెస్ అల్లు ఫ్యామిలీ గా వివాదం మొదలైందని టాక్. పుష్ప 2 సినిమా భారీ వసూళ్లు సాధించడం అలాగే త్వరలో రాబోయే గేమ్ చేంజర్ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ప్రభావం పడటంతో దిల్ రాజు ఆగ్రహంగా ఉన్నారట. రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో వెనకడుగు వేసే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు సినిమా పరిశ్రమ రెండుగా చీలిపోయింది అనే అభిప్రాయం వినపడుతుంది. బెనిఫిట్ షోలు దాదాపుగా గత పదేళ్ళ నుంచి సినిమా పరిశ్రమకు అండగా నిలుస్తూ వచ్చాయి.

Also Read: రాజీకి సిద్దం.. రేవంత్ ఇంటికి సినిమా పెద్దలు…!

ఈ టైంలో చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఒక్కసారిగా సినిమా పరిశ్రమ షాక్ అయింది. కీలకమైన హైదరాబాదులో బెనిఫిట్ షోలను రద్దు చేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనే భయం సినిమా పరిశ్రమ పెద్దల్లో నెలకొంది. మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉంది. మరి దీనినే దిల్ రాజు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి. తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమితులైన డీల్ రాజు చొరవ తీసుకుని సిఎం రేవంత్ రెడ్డి ని ఒప్పించే బాధ్యత తీసుకోవాలని సినీ పెద్దలు కోరుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్