Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

పవన్ తో భేటీ.. టాలీవుడ్‌లో టెన్షన్..!

తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పుడు పెద్ద తలనొప్పి ఎదురవుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత పరిస్థితులన్నీ టాలీవుడ్‌కు వ్యతిరేకంగా మారిపోయాయి. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ పెద్దలపై చూసీ చూడనట్లుగా వ్యవహరించింది. ఏది అడిగినా సరే… కాదు, లేదు అనకుండా ఓకే చేసేసింది. షూటింగ్ పర్మిషన్ దగ్గర నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్, బెనిఫిట్ షో, టికెట్లు రేట్ల పెంపు.. ఇలా ప్రతి విషయాన్ని కూడా పూర్తి సానుకూలంగానే వ్యవహరించింది. అయితే పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట జరగటం, ఓ మహిళ మృతి, మరో చిన్నారి పరిస్థితి విషమంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బెనిఫిట్‌ షోలకు నో పర్మిషన్ అని రేవంత్ తేల్చి చెప్పేశారు. ఇదే విషయాన్ని సినీ పెద్దల సమావేశంలో కూడా రేవంత్ క్లియర్ చేశారు.

Also Read : రేవంత్ ప్రకటనతో.. చంద్రబాబుకు ఇబ్బందులు..!

రేవంత్ ప్రకటనతో టాలీవుడ్‌లో సంక్రాంతి టెన్షన్ మొదలైంది. ప్రతి ఏటా సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేయడం ఆనవాయితీ. వారం రోజుల పాటు సెలవులు వస్తాయి కాబట్టి… ఆ వారంలో పెద్ద సినిమాలు విడుదల చేసి… టికెట్ రేట్లు పెంచుకుంటే… కాస్త లాభాలు వస్తాయనేది నిర్మాతల ఆలోచన. గతంలో మాదిరిగా ఇప్పుడు ఏ సినిమా కూడా వంద రోజులు కాదు కదా.. కనీసం 50 రోజులు కూడా ఆడటం లేదు. గతంలో దర్శక రత్న దాసరి నారాయణరావు చెప్పినట్లు… ప్రస్తుతం సినిమాలన్నీ 2 వారాలు లేదా ఆ మూడు, నాలుగు రోజులే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ ప్రకటనతో టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాలపై ఉత్కంఠ పెరుగుతోంది.

Also Read : ఏపీ బియ్యం దొంగలపై కొత్త సిట్.. జాగ్రత్త పడ్డ సర్కార్…!

ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్.. ఏ ఇద్దరు నిర్మాతలు కలిసినా సరే ఇదే విషయంపై చర్చ… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మనకు సహకరిస్తారా… అనే అంశమే. వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పవన్ డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్న వెంటనే… టాలీవుడ్ పెద్దలంతా సంతోషించారు. పరిశ్రమకు చెందిన వ్యక్తి కాబట్టి… అన్ని విధాలుగా అండగా ఉంటారని భావించారు. అలాంటి పవన్ ప్రస్తుతం ఏం చేయబోతున్నారు… కష్టకాలంలో పరిశ్రమకు ఎలా అండగా నిలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది. త్వరలో పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యేందుకు టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 30న భేటీ ఉంటుందని భావిస్తున్నారు. అదే రోజు సాయంత్రం చంద్రబాబును కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీకి బాలయ్యను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య మాత్రం… ఈ విషయంలోకి నన్ను లాగొద్దు ప్లీజ్ అని చెప్పేశారట. దీంతో టాలీవుడ్ ప్రముఖుల ఆశలన్నీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మీదే ఉన్నాయంటున్నారు సినీ, రాజకీయ విశ్లేషకులు. మరి పవన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలంటే… ఈ భేటీ అయ్యే వరకు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్