Sunday, March 15, 2026 05:48 PM
Sunday, March 15, 2026 05:48 PM

ఈరోజు రాశి ఫలితాలు (15-03-2026)

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం 15-03-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

—————————————

వృషభం

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.

—————————————

మిధునం

గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

కర్కాటకం

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

—————————————

సింహం

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు.

—————————————

కన్య

సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

తుల

ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

—————————————

వృశ్చికం

కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

—————————————

ధనస్సు

ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి.

—————————————

మకరం

వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

కుంభం

అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

—————————————

మీనం

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బీఆర్ఎస్ కు గంపెడు...

తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసి, పదేళ్ల...

ముఖం చాటేసిన మంత్రులు..!

ఏపీలో కొందరు మంత్రుల తీరు ఇప్పుడు...

బిజెపికి షాక్ ఇచ్చిన...

ప్రాంతీయంగా కొత్తగా పుట్టిన పార్టీలు అయినా,...

మీకోసమే ఇదంతా.. గిరిజనులతో...

ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన...

వాళ్ల కంటే.. గూగుల్...

"మేము చేసింది చెప్పుకోలేక పోయాము.. చేసింది...

రాజకీయాల్లోకి ప్రీతి రెడ్డి.....

రాజకీయాల్లోకి మరో వారసురాలు రెడీ అయ్యారు....

పోల్స్