Saturday, September 13, 2025 11:23 AM
Saturday, September 13, 2025 11:23 AM
roots

ఏపీ పోలీసులకి బెదిరింపు ఫోన్ కాల్స్

ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్లుగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు ఒక్కొక్కరిని అరెస్ట్ లు చేస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పోలీసులు ఎట్టకేలకు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఇష్టం వచ్చినట్టు పోస్ట్ లు పెడుతూ… అభ్యంతరకరంగా మార్ఫింగ్ లు చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. పోలీసుల వ్యవహారశైలిపై ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉండటంతో ఇన్నాళ్ళు ధీమాగా ఉన్న వైసీపీ బ్యాచ్ లో ఆందోళన మొదలయింది.

Also Read: టార్గెట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా మృగాల వేట మొదలైంది

వర్రా రవీంద్రా రెడ్డిని, కళ్ళం హరి కృష్ణా రెడ్డి, ఇంటూరి రవి కిరణ్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణా రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది. ఈ నేపధ్యంలో వైసీపీ అగ్ర నాయకత్వం అలెర్ట్ అవుతోంది. పోలీసులకు ఫోన్ లు చేసి… కార్యకర్తలను వదిలిపెట్టాలని బెదిరించడం గమనార్హం. ఈ రోజు ఉదయం పులివెందులలో రాఘవ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళిన పోలీసులను ఓ కీలక నేత ఫోన్ చేసి బెదిరించారని సమాచారం. అందుకే పోలీసులు వెనక్కు తిరిగి వెళ్లారట.

Also Read: టార్గెట్ వర్రా కాదా…? అసలు ఏం జరుగుతోంది…?

ఇక కళ్ళం హరికృష్ణా రెడ్డికి కోర్ట్ రిమాండ్ విధించకముందు… వదిలేయాలని పోలీసులను బెదిరించారట కొందరు. ఇక వర్రా విషయంలో ఏం జరుగుతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. కాని అతన్ని వదిలిపెట్టాల్సిందే అనే బెదిరింపులు రావడంతో పోలీసులు కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వైసీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తల నేపధ్యంలో అధిష్టానం అలెర్ట్ అయినట్టు సమాచారం. ఎస్పీలను కూడా బెదిరించే స్థాయికి వైసీపీ నేతలు వెళ్ళారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక పోలీసులను బెదిరిస్తూ వైసీపీ నేతలు ప్రసంగాలు చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్