Saturday, September 13, 2025 05:12 AM
Saturday, September 13, 2025 05:12 AM
roots

ఆ డిపార్ట్‌మెంట్ తీరుపై విమర్శలు..!

జై జగన్ అని చెప్పు చాలు.. వదిలేస్తాం.. లేదంటే చస్తావ్.. అంటూ పీక మీద కత్తి పెట్టి బెదిరించారు. అయినా సరే.. చచ్చినా జై జగన్ అనేది లేదు.. పసుపు జెండా వదిలేది లేదు అని తెగేసి చెప్పాడు. ఇక వీడు మన మాట వినడు అనుకున్నారు.. అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద గొంతు కోసి హత్య చేశారు. ఇంతకీ ఎవరి గురించో తెలుసు కదా.. తోట చంద్రయ్య.. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత తోట చంద్రయ్యను వైసీపీ గూండాలు దారుణంగా హత్య చేశారు. జై జగన్ అంటే చాలు.. వదిలేస్తాం.. టీడీపీ జెండా పడిసి వైసీపీ జెండా పట్టుకో అని బెదిరించారు. కానీ ససేమిరా అనటంతో తోట చంద్రయ్యను వైసీపీ రౌడీ మూకలు హత్య చేశారు. సరిగ్గా సంక్రాంతి పండుగకు ఒక్క రోజు ముందు జనవరి 13, 2022వ తేదీన వెల్దుర్తి మండలం గుండ్లపాడులో నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే చంద్రయ్యను హత్య చేశారు.

Also Read : ఏపీ భవిష్యత్తు నిర్మిస్తున్నాం.. లోకేష్ ఆసక్తికర కామెంట్స్

చంద్రయ్య హత్య వెనుక మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. పిన్నెల్లి బ్రదర్స్ చెబితేనే చంద్రయ్యను హత్య చేశారు అనేది వాస్తవం. ఈ మాట మాచర్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ తెలుసు కూడా. అయినా సరే.. పోలీసులు మాత్రం నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగానే నడుచుకున్నారు. అందుకే.. హత్య కేసులో అసలు సూత్రధారులను వదిలేశారు. హత్య చేసిన నిందితులను తెల్లారే పట్టుకున్న పోలీసులు.. హత్యకు కుట్ర చేసిన వారిని మాత్రం కనీసం ప్రశ్నించలేదు. హత్య చేస్తున్నప్పుడే… హంతకులు జై పిన్నెల్లి అని నినాదాలు కూడా చేశారు. వెల్దుర్తి ఎంపీపీ చింతా శివనారాయణ, అతని కుమారులు ఆది నారాయణ, శ్రీనివాసరావు ఈ దురాగతానికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే చంద్రయ్యను కర్రలు, రాళ్లతో దారుణంగా కొట్టి… తర్వాత గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత తాపీగా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ హత్యకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో అన్ని సోషల్ మీడియాలో కూడా వచ్చాయి.

Also Read : అవును.. వాళ్ల ఆచూకీ కనిపెట్టలేరు..!

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హత్యకు ముందు రోజు అర్థరాత్రి ఒంటి గంట వరకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గుండ్లపాడులోనే ఉన్నారు. ఎంపీపీ చింతా శివనారాయణ ఇంట్లోనే చర్చలు కూడా జరిపారు. హత్య జరిగిన తర్వాత కూడా పిన్నెల్లి బ్రదర్స్‌కు చెందిన మనుషులు గ్రామంలో పర్యటించారు. పరిస్థితులు అంచనా వేశారు. టీడీపీ నేతలు ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారా అని పరిశీలించారు. ఇంత జరిగినా కూడా పోలీసులు తీరు అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హత్య జరిగిన గుండ్లపాడుకు మండల కేంద్రం వెల్దుర్తి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఉదయం ఏడున్నరకు హత్య జరిగితే.. పోలీసులు మాత్రం రెండున్నర గంటల తర్వాత పది గంటలకు గుండ్లపాడు చేరుకున్నారు. ఈ లోపు హంతకులు ఊరు దాటేశారు కూడా.

Also Read : ఏపీ లిక్కర్ స్కాం.. ఆధారాలన్నీ హైదరాబాద్ లోనే..?

చంద్రయ్య హత్య గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా గుండ్లపాడు వెళ్లారు. చంద్రయ్య పాడే మోశారు. హత్యకు జగన్ జవాబు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హంతకులను పోలీసులు వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. దీంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోందని భావించిన వైసీపీ పెద్దలు.. హంతకులను పోలీసులకు అప్పగించారు. అయితే చంద్రయ్య హత్యకు ప్రధాన కుట్రదారు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవాలని టీడీపీ నేతలు, అభిమానులు చంద్రయ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం.. ఈ హత్యతో వెంకట్రామిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేశారు.

Also Read : యూకే రావొద్దు.. భారత మహిళ సంచలన వార్నింగ్

వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా నాటి పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారనేది వాస్తవం. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రయ్య హత్య కేసును సీఐడీకి అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు పూర్తి ఫైలును వెంటనే సీఐడీకి పంపాలని పోలీసు శాఖను ఆదేశించారు కూడా. ఈ కేసులో తనను అరెస్టు చేస్తారని భావించిన వెంకట్రామిరెడ్డి.. ముందుగానే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్ పరిగణలోకి తీసుకోవాలని.. దాని ఆధారంగా అయితే.. తన పేరు లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Also Read : ప్రపంచ కప్ కష్టమే.. గవాస్కర్ సంచలన కామెంట్స్

వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పును సరిచేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వ న్యాయ విభాగానిదే. గత ప్రభుత్వంలో హంతకులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తే.. అలా ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని నాటి టీడీపీ న్యాయ విభాగం గట్టిగా వాదించింది. అయితే నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని నాటి పీపీ వాదించారు కూడా. కానీ బాధితుల తరఫున వాదించిన టీడీపీ న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన గురజాల సెషన్స్ కోర్డు.. నిందితులకు బెయిల్ నిరాకరించింది. కానీ నేటికి ఛార్జ్‌షీటులో మార్పులు చేయలేదు. దీంతో అసలు నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు. అటు ప్రస్తుత ప్రభుత్వ న్యాయ విభాగం పెద్దలు కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే స్వయంగా చంద్రబాబు ఆదేశించినా కూడా.. బాధితులకు సరైన న్యాయం జరగటం లేదు. కీలక సూత్రధారులు పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పటికీ జాలీగా బయటే ఉన్నారు. కానీ వారిపై ఎలాంటి ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేయడం లేదు.

Also Read : ఇదీ కింగ్ బ్రాండ్.. హోరెత్తుతున్న సోషల్ మీడియా

చంద్రయ్య లాంటి సాధారణ కార్యకర్తకే న్యాయం జరగకపోతే.. ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటీ అనే ప్రశ్న తలెత్తుతోంది. స్వయంగా పార్టీ అధినేత ఈ హత్య కేసులో కీలక నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది కావొస్తోంది. అయినా సరే.. ఇప్పటికీ ఛార్జ్‌షీట్ కూడా మార్చలేదు. హత్యకు ప్లాన్ చేసిన వారి పేర్లు ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచేందుకు కూడా పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ న్యాయ విభాగం కూడా అంతే అశ్రద్ధ చూపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్