ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులు ఎంతగానో ఎదురు చూస్తున్న న్యూ ఎక్సైజ్ పాలసీ నేటి నుంచి అమలులోకి రానుంది. ప్రైవేట్ రిటైల్ మద్యం వ్యాపారులకు కేటాయించిన షాపులు ప్రారంభం కానున్నాయి. కొత్త బ్రాండ్ల తో అందుబాటులోకి మద్యం దుకాణాలు రావడంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. టెంపరరీ లైసెన్స్ పొందిన వ్యాపారులకు నిన్న రాత్రే నుంచే లిక్కర్ స్టాక్ సప్లై చేస్తున్నారు. వారం రోజులు తర్వాత దుకాణాలను పరిశీలించి పర్మినెంట్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ కేటాయిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలన్న నిబంధన విధించారు. దేవాదాయ శాఖ గుర్తింపు పొందిన ఆలయాలు, వక్ఫ్ బోర్డు అనుమతి తీసుకున్న మసీదులు, ప్రభుత్వం గుర్తింపు పొందిన చర్చిలకు 100 మీటర్ల దూరం ఉండాలన్న నిబంధన ఉంది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న 30 పడకల ఆసుపత్రికి కూడా 100 మీటర్ల దూరం నిబంధన తప్పనిసరి చేసారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లు మీదుగా వెళ్లే స్టేట్ నేషనల్ హైవేస్ పై ఇప్పటిదాకా ఉన్న నిబంధనలకు సడలించారు.
Also Read : ఏపీకి ఆమ్రపాలి… పోస్టు కూడా ఖరారైనట్లే…!
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కపిలతీర్థం అలిపిరి వరకు తిరుమల బైపాస్ రోడ్డు, రుయా, స్విమ్స్ ఆసుపత్రి కూడలి వరకు రోడ్డుకు ఇరువైపులా మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు. మరోవైపు రద్దీ సర్కిల్స్ లో మద్యం దుకాణాల ఏర్పాటుకు డిమాండ్ రావడంతూ దుకాణాల ఏర్పాటుకు లక్షల్లో అద్దె డిమాండ్ చేస్తున్నారు బిల్డింగ్ యజమానులు. మద్యం షాపు లాటరీలలో మహిళలు కూడా సత్తా చాటడం హైలెట్ గా నిలిచింది. తిరుపతి జిల్లాలో 227 మద్యం దుకాణాల్లో లిక్కర్ షాప్స్ లైసెన్స్ ను 16 మంది మహిళలు పొందడం గమనార్హం.