అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అమరావతి నిర్మాణానికి రుణ సాయం ఒప్పందానికి ఏ సియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏ డి బి) ఆమోద ముద్ర వేసింది. మనీలాలో నిన్న జరిగిన సమావేశంలో ఒప్పందానికి ఏడిబి బోర్డు మీటింగ్ ఆమోద ముద్ర వేసింది. అమరావతి నిర్మాణానికి ఏడిబి నుండి 8000 కోట్ల సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మరోవైపు ఈనెల 17న వరల్డ్ బ్యాంక్ బోర్డు మీటింగ్ జరగనుంది. 17న జరిగే బోర్డు మీటింగ్ లో అమరావతి సాయం ఒప్పందానికి ఆమోదముద్ర వేయనుంది ప్రపంచ బ్యాంకు.
Also Read : సైలెంట్ గా కీర్తి పెళ్లి… అతి తక్కువ మంది అతిధులే
నిర్మాణానికి రుణ సాయంపై ఇప్పటికే ఒప్పందం రూపొందించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు అనంతరం ఒప్పందానికి తుది రూపు దిద్దారని సమాచారం. ఈ కసరత్తులో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ అధికారులు, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు బోర్డు ఓకే అనంతరం ఒప్పంద పత్రంపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ అధికారులు, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. అనంతరం నిధులు విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
రుణ రూపేణ మొత్తం 16 వేల కోట్ల నిధులు అందనున్నాయి. 16 వేల కోట్లలో చెరో 8 వేల కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివ్రుద్ధి బ్యాంకు అందిస్తాయి. నిధులు అందనున్న నేపథ్యంలో పనులకు సంబంధించి ఇప్పటికే కింది స్థాయిలో పూర్తి ప్రణాళికను సి ఆర్ డి ఏ, రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేసాయి. జనవరి నుంచి ఈ పనులు మొదలుకానున్నాయి. వివిధ పనులకు దాదాపు టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ప్రభుత్వ భవనాలు ఎక్కువగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తోంది.
Also Read : అమ్మో పవన్ అంటున్న అధికారులు.. తర్వాతి గురి ఎవరిపై..?
ఇదిలా ఉంచితే అమరావతి రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతి అనేది ప్రజా రాజధానని… అమరావతి యువతకు ఉపాధి కల్పించే రాజధాని అన్నారు. విశాఖ, తిరుపతి, అమరావతిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెడుతుంది అన్నారు. ఒక కుటుంబం ఒక ఎంట్రప్రెన్యూ్ర్ అనేది అమలు కావాలని స్పష్టం చేసారు. త్వరలో ఏపీకి పలు నాలెడ్జి ఎకానమీ యూనివర్శిటీలు రానున్నాయని తెలిపారు. ఏపీకి ప్రపంచంలోని టాప్ 10 యూనివర్సిటీలు, టాప్ 10 హాస్సిటల్స్, 5 స్టార్ హోటల్స్ రానున్నాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్టార్ హోటల్స్ నిర్మాణం కోసం స్థలాలను కేటాయిస్తామని అమరావతిలో 5 స్టార్ హోటల్స్ నిర్మాణం జరగనుంది తెలిపారు. త్వరలోనే స్థలాల కేటాయింపు కూడా పూర్తి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.




