నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు రాగా ఇప్పుడు మరో సినిమా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. సింహ, లెజెండ్, అఖండ సూపర్ హిట్ లు అయ్యాయి. ఇప్పుడు అఖండ 2 వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్ కు మరో హైలెట్ కూడా ఉంది. అదే తమన్.. అఖండ సినిమాతో ఓ ఊపు ఊపాడు తమన్.
Also Read : విజయ్ కు ఎన్డీయే ఆఫర్లు ఇవే..?
అక్కడి నుంచి బాలయ్య కోసం తమన్ అందించే మ్యూజిక్ మరో హైలెట్ అవుతోంది. బాలకృష్ణ సినిమా అంటే ప్రాణం పెట్టి కొట్టే తమన్.. ఇప్పుడు అఖండ 2 విషయంలో అదే రేంజ్ లో వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఈ టైం లో ఓ న్యూస్ బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. అసలు ఏంటీ ఆ న్యూస్ అనేది ఒకసారి చూద్దాం. పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలో వస్తోన్న ఈ సినిమాలో ఆధ్యాత్మిక స్పర్శను మరింత కలిగించేందుకు తమన్ ప్రత్యేకంగా ప్లాన్ చేసాడు.
Also Read : యువతకు ఏం కావాలో తేల్చేసిన పవన్..!
సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు చెప్పడంలో ప్రముఖులుగా పేరు తెచ్చుకున్న పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులను అఖండలో భాగం చేసాడు. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ కాబోతున్నాయని ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ యాక్షన్ సీన్స్ కు వీళ్లు పఠించే శ్లోకాలు సినిమాను మరో లెవెల్ కు తీసుకువెళ్ళడం ఖాయంగా చెప్తున్నారు ఫ్యాన్స్. కాగా ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.