తల్లికి వందనం.. ఈ సంక్షేమ కార్యక్రమం గురించి వైసిపి చేసిన నెగిటివ్ ప్రచారం అంతా ఇంతా కాదు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఏడాదికి పైగా సమయం తీసుకుంటే.. ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని గత ఏడాది ఆగస్టు నుంచి వైసీపీ కామెంట్ చేయడం మొదలుపెట్టింది. ఆ కామెంట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి కూడా బలంగానే వెళ్ళాయి. ఈ విషయంలో టిడిపి నేతలు కూడా పెద్దగా రియాక్ట్ కాలేకపోయారు.
Also Read : మళ్ళీ ఢిల్లీకి లోకేష్.. కారణం అదేనా..?
ఇతర కూటమి పార్టీల కంటే టిడిపి పైన ఎక్కువగా ప్రభావం పడిందని చెప్పాలి. ఇతర పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే టిడిపి అభ్యర్థులే ఎక్కువగా దీని గురించి ప్రజల్లోకి ప్రచారం బాగా తీసుకువెళ్లారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటుగా చాలామంది అభ్యర్థులు ప్రజల్లో స్వయంగా దీని గురించి మాట్లాడారు. దీనితో ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కామెంట్స్ చేసిన పరిస్థితి. ఇక వైయస్ జగన్ కూడా దీనిపై సోషల్ మీడియాతో పాటుగా డైరెక్ట్ గా విమర్శలు చేశారు. తీరా చూస్తే సరిగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి ఈ సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ..!
దీనిపై టిడిపి నేతలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. మంత్రులు కూడా తమకు అవకాశం ఉన్న ప్రతి చోట దీని గురించి ప్రచారం చేశారు. జనసేన లేదంటే బిజెపి సంగతి పక్కన పెడితే టిడిపికి ఈ సంక్షేమ కార్యక్రమం బాగా ప్లస్ అయింది. దానికి తోడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కావడం కూడా టిడిపికి కలిసి వచ్చిన అంశం. అందుకే ఈ విషయంలో టిడిపి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక రాబోయే అన్నదాత సుఖీభవ కార్యక్రమం విషయంలో కూడా ఇలాగే దూకుడుగా వెళ్లాలని కార్యకర్తలు కోరుతున్నారు.