ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లను గమనించారా…? స్టీవ్ స్మిత్, జొ రూట్, బెన్ స్టోక్స్, కెన్ విలయమ్సన్ వంటి ఆటగాళ్ళు టెస్ట్ క్రికెట్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. గతంలో కూడా అండర్సన్, బ్రాడ్, అలిస్టర్ కుక్ వంటి ఆటగాళ్ళు కూడా టెస్ట్ క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. మన భారత్ లో కూడా లక్ష్మణ్, ద్రావిడ్, పుజారా, రహానే వంటి ఆటగాళ్ళు టెస్ట్ క్రికెట్ కు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. దేశవాళి క్రికెట్ ఎల్లప్పుడూ ఆడుతూ టెస్ట్ క్రికెట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండేవారు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా వాళ్ళ ప్రదర్శన మాత్రం మెరుగ్గా ఉండేది.
Also read : ఛీఛీ.. భారత జట్టుకి దారుణ ఓటమి..!
కానీ ఇప్పుడు పరిస్థితులు అలా కనపడటం లేదు. ఇతర దేశాల్లో ఆటగాళ్ళు టెస్ట్ క్రికెట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ సాంప్రదాయ క్రికెట్ ను కాపాడుకుంటూ ఉంటే… మన దేశంలో మాత్రం టెస్ట్ క్రికెట్ ను చాలా లైట్ తీసుకుని ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ ఆట తీరు అయితే పరమ చెత్తగా ఉంది. అతని స్థాయికి తగ్గ ఆట తీరు ఏ కోణంలో కూడా కనపడలేదు. టెస్ట్ క్రికెట్ లో రన్ అవుట్ కావడం అనేది ఖచ్చితంగా నేరమే. అది కూడా రోజు చివరి ఓవర్ లో. మూడో టెస్ట్ లో అతను అవుట్ అయితే రెండో టెస్ట్ లో పంత్ ను అవుట్ చేసాడు. దీనిపై చాలానే విమర్శలు ఉన్నాయి. అతని నిర్లక్ష్యం ఖరీదు రెండు టెస్ట్ మ్యాచ్ లు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరీస్ ఓటమితో భారత టెస్ట్ ర్యాంకింగ్ లో మొదటి స్థానం కోల్పోవాల్సి వచ్చింది.
Also Read : భారత్ పై కెనడా కుట్రలు ఆపదా..?
స్పిన్ బౌలింగ్ లో భారత ఆటగాళ్ళు ఒకప్పుడు దిట్ట. కానీ సాదా సీదా స్పిన్ కె బోల్తా పడిపోవడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. టెస్ట్ క్రికెట్ కోసం ప్రిపేర్ కావడం అనేది గతంలో మాదిరిగా లేదు. కోహ్లీ… లండన్ లో ఉంటూ క్రికెట్ ఆడటం కోసం ఇండియా వచ్చి వెళ్తున్నాడు. ఇక రోహిత్ శర్మ ఆట తీరు కూడా గొప్పగా లేదనే విమర్శలు ఉన్నాయి. టెస్ట్ జట్టులో రహానే, పుజారా అవసరం ఉన్నా సరే దూరం పెట్టడం దారుణం అనే విమర్శలు వినపడుతున్నాయి. మిడిల్ ఆర్డర్ లో ఆ ఇద్దరూ ఉంటే ఖచ్చితంగా జట్టు మూడు మ్యాచుల్లో కనీసం రెండు అయినా గెలిచి ఉండేది అనే అభిప్రాయం వినపడుతోంది. వైట్ బాల్ క్రికెట్ ను పూర్తిగా వదిలి ఇతర దేశాల ఆటగాళ్ళ మాదిరి టెస్ట్ క్రికెట్ పై ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు.




