ఇప్పుడంటే తీర్థయాత్రలు అనే పదం పెద్దగా వినపడటం లేదు గాని.. గతంలో మాత్రం తీర్థయాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ముఖ్యంగా వయసు పైబడిన వారు ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడేవారు. ఇందులో ప్రధానంగా వినపడేది కాశీ యాత్ర. దీనిని మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. కుటుంబాలకు కుటుంబాలు రోజుల పాటు తీర్థయాత్రల పేరుతో కాశీలోనే ఉండేవారు. అక్కడి దేవాలయాలన్నీ తిరుగుతూ ఆధ్యాత్మిక చింతనలో ఉండటానికి ఆసక్తి చూపించేవారు.
Also Read : కారు స్టీరింగ్ పట్టుకునేది ఎవరు..?
తెలుగువారు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో వారణాసి ముందు వరుసలో ఉంటుంది. అందుకే అక్కడ ప్రజలకు కూడా మన తెలుగు వారు సూపరిచితం. ఇక ప్రభుత్వాలకు కూడా సుపరిచితం అనే విషయం తాజాగా అర్థమైంది. అక్కడి సైన్ బోర్డ్స్ లో తెలుగు భాష ఉండటం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ వెళ్లిన తెలుగు భక్తులు అక్కడి సైన్ బోర్డ్స్ లో తెలుగు భాషను చూసి… వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారణాసి మొఘల్సరాయ్, బదోహి, ప్రయాగ్రాజ్ విమానాశ్రయం, సంఘం ఘాట్.. గోరఖ్పూర్, జాన్పూర్, నైనీ రైల్వే స్టేషన్ సోమేశ్వరాలయం, మీర్జాపూర్ వంటివి తెలుగులో రాశారు.
Also Read : చంద్రబాబు చెప్పినా లెక్క లేదా…?
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దేశంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో తెలుగు కూడా ఉంటుంది. దానికి తోడు తెలుగువారు ఉత్తరాదిలో ఎక్కువగా వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కాశీలో వస్త్ర వ్యాపారం చేసే వారిలో తెలుగు వారి సంఖ్య ఎక్కువే. దానికి తోడు తీర్థయాత్రలకు వెళ్లే వారిలో కూడా తెలుగువారు అధికంగా ఉంటారు. దీనితోనే అక్కడి సైన్ బోర్డ్స్ లో అధికారులు తెలుగు పదాలను యాడ్ చేస్తూ ఏర్పాటు చేశారు. కేరళలో కూడా ఇదే విధంగా తెలుగులో సైన్ బోర్డ్స్ లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శబరిమలై వెళ్లే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది అనే కారణంతో తెలుగును కేరళ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాగే తెలుగు వాడటం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక భాషా ప్రేమికులైతే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.




