Friday, October 24, 2025 12:08 PM
Friday, October 24, 2025 12:08 PM
roots

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా రేవంత్ రెడ్డి తమ్ముళ్లు.. ఒకరు మల్కాజ్‌గిరి నుంచి, మరొకరు..?

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంలో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ క్రమంలోనే.. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు కూడా ఖరారైంది. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవటమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా 17కు 17 ఎంపీ స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే.. ఇప్పటివరకు ఒక్క ఎంపీ అభ్యర్థి మినహా.. ఎవ్వరి పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించకపోవటం గమనార్హం. మొన్న జరిగిన కొడంగల్ సభలో.. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీ చంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. లోక్ సభ ఎన్నికల బరిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులు నిలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అందరి కన్ను.. మాల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంపై పడింది. ఈ స్థానం నుంచి ఈటల రాజేందర్‌ను బీజేపీ బరిలో దించుతుండగా.. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేయనున్నారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

అయితే.. మల్కాజ్‌గిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డి పోటీ చేయనున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆ సీటు కొండల్ రెడ్డికి ఖరారు అయిందని.. ఆయనకు శుభాకాంక్షలు కూడా చెప్తూ ఫ్లెక్సీలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. మల్కాజ్‌గిరి టికెట్‌ను మైనంపల్లి హనుమంత రావు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన హనుమంతరావు.. మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయగా మల్లారెడ్డిపై ఓడిపోయారు. కాగా.. ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి.. సత్తా చాటాలని కృషి చేస్తున్నారు. అయితే.. బీజేపీ నుంచి ఈటల లాంటి బలమైన నేత బరిలోకి దిగుతుండగా.. రేవంత్ సోదరున్ని నిలుపుతారా, మైనంపల్లికి ఛాన్స్ ఇస్తారా.. అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

పోల్స్