గత ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై జస్టిస్ ఘోష్ కమీషన్ విచారణ వేగవంతం చేసింది. కాలేశ్వరం కమిషన్ వద్ద ఐఏఎస్ రజత్ కుమార్, ఎస్కే జోషి బహిరంగ విచారణకు హాజరు అయ్యారు. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ నిర్వహించింది. విచారణకు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి హాజరు అయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా… అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందని జోషి సమాధానం ఇచ్చారు.
ప్రాజెక్ట్ స్థలాన్ని ఎవరు మార్చారని కమిషన్ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నాటి సీఎం, మంత్రులు నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని జోషి బయటపెట్టారు. కేబినెట్ సబ్ కమిటీ ఏమీ లేదని సమాధానం చెప్పగా… సీఎం నిర్ణయమేనా మేడిగడ్డ ప్రాజెక్ట్ అని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వం అని సమాధానం చెప్పగా ప్రభుత్వం ఎవరు అని కమిషన్ ప్రశ్నించింది. సీఎం, మంత్రులు అని జవాబు ఇచ్చారు. సీఎం నిర్ణయమే ఫైనల్ కదా అని ప్రశ్బించగా.. అవునని సమాధానం చెప్పారు.
Also Read : జగన్ పై తెలంగాణా మంత్రుల స్పెషల్ లవ్… ఈ నోటి దూల అందుకేనా…?
సీఎం అన్ని నిర్ణయాలు కేబినెట్‌కు చెప్పాల్సిన అవసరం లేదని జోషి అనగా… కేబినెట్ సీఎం కన్న పెద్దదని కమీషన వ్యాఖ్యానించింది. హైపవర్ కమిటీ గురించి తెలియదని తొలుత సమాధానం ఇచ్చి… తర్వాత వేరే జీవో చూపించాక అవునని ఒప్పుకున్నారు జోషి.. అది టెక్నికల్ కమిటీ మాత్రమేనని తెలిపారు. మహారాష్ట్ర వైపు ముంపు ఎక్కువుండడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కట్టారని… కాళేశ్వరం కాంప్లెక్స్ ప్రాజెక్ట్.. 28 ప్యాకేజీలు.. 8 లింకులతో కట్టారు ఒక్కటే అప్రూవల్ లేదని అంగీకరించారు.
వివిధ సమయాల్లో ఆయా ప్యాకేజీలకు దాదాపు 200 అనుమతులు ఇచ్చి ఉంటారన్నారు. ప్రాజెక్టుకు బడ్జెట్ ఉందా… లేదా సప్లిమెంటరీ బడ్జెట్ ఇచ్చారా అనే ప్రశ్నకు వార్షిక బడ్జెట్ మాత్రమే ఉంటుంది.. అవసరాన్ని బట్టి బడ్జెట్ సప్లిమెంట్ చేస్తారని తెలిపారు. బ్యారేజీ నిర్మాణ సంస్థలు ఇతర ఏజెన్సీల సాయమేమైనా తీసుకున్నారా అనే ప్రశ్నకు కాంట్రాక్ట్ సంస్థలు అవసరాన్ని బట్టి వేరే సంస్థల (సబ్ కాంట్రాక్ట్) సాయం తీసుకొని ఉండొచ్చని సమాధానం ఇచ్చారు ఎస్కే జోషి.. డిజైన్ల లోపం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం, గేట్ల ఆపరేషన్‌ల లోపం వంటి కారణాలతో మేడిగడ్డ కుంగిపోయి ఉండొచ్చని వెల్లడించారు.