తెలంగాణాలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గద్దర్ అవార్డులను ప్రకటించారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ అవార్డులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సినిమా పరిశ్రమ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపించకపోయినా సిఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ముందుకు వెళ్ళారు. గద్దర్ పేరు పెట్టడాన్ని కొందరు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో సినిమా పరిశ్రమ కూడా క్రమంగా దారిలోకి వచ్చిన విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.
Also Read: మొత్తం ఆయనే చేశారు.. బడా నిర్మాతపై ఆరోపణ..!
ఈ తరుణంలో కమిటీ ని కూడా ఏర్పాటు చేసి.. అవార్డులను ప్రకటించారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 జాబితా ఒకసారి చూస్తే.. ఉత్తమ మొదటి చిత్రం కల్కి కాగా, ఉత్తమ రెండో చిత్రంగా పొట్టేల్ నిలిచింది. ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్ ను ప్రకటించారు. ఉత్తమ బాలల చిత్రంగా.. 35 ఇది చిన్న కథ కాదు”ని ఎంపిక చేసారు. ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డుకు రజాకార్ సినిమాను ఎంపిక చేసారు. ఉత్తమ నటుడుగా పుష్ప-2 సినిమాకు గానూ అల్లు అర్జున్ ను ఎంపిక చేసింది కమిటీ.
Also Read : పెద్దల సభకు కమల్ హాసన్.. స్టాలిన్ సంచలన నిర్ణయం
ఉత్తమ దర్శకుడుగా కల్కీ సినిమాకు గానూ నాగ్ అశ్విన్ ను ఎంపిక చేసారు. ఉత్తమ నటిగా.. 35 ఇది చిన్న కథ కాదు సినిమాకు నివేదా థామస్ ను ఎంపిక చేసింది కమిటీ. ఉత్తమ గాయనిగా పుష్ప 2 సినిమాకు గానూ.. శ్రేయా ఘోషల్ ను ఎంపిక చేసారు. ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డుకు వెంకీ అట్లూరిని లక్కీ భాస్కర్ సినిమాకు ఎంపిక చేసారు. ఉత్తమ హాస్యనటులుగా.. వెన్నెల కిషోర్, సత్య గద్దర్ అవార్డును సొంతం చేసుకున్నారు. దేవర సినిమాకు గానూ ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్యకు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్ వరించింది. ఉత్తమ కథా రచయితగా శివ పాలడుగు, ఉత్తమ పుస్తక రచయితగా రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం), స్పెషల్ జ్యూరీ అవార్డు – అనన్య నాగళ్ల (పొట్టేల్), స్పెషల్ జ్యూరీ – దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), స్పెషల్ జ్యూరీ – ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)లను ఎంపిక చేసారు. జూన్ 14న హైటెక్స్‌లో అవార్డుల ప్రదానం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.