ప్రభుత్వ అధికారుల అవినీతి గత పదేళ్ళ కాలంలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. నిజాయితీగా సమస్యలు ఉన్న ప్రజల నుంచి, అక్రమార్కుల నుంచి పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. వీరి విషయంలో ప్రభుత్వాలు ఎంత సీరియస్ గా వ్యవహరిస్తున్నా సరే వారి వైఖరిలో మాత్రం మార్పు లేదు. ముఖ్యంగా తెలంగాణాలో ప్రభుత్వం మారిన తర్వాత వారి విషయంలో కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ శాఖల్లో అవినీతి మీద ఫోకస్ చేసి.. ఏసీబీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read : మీకు ఇదేం పిచ్చి రా బాబు..!
తెలంగాణలో ఏసీబీ దూకుడు మరింతగా పెరిగింది అనే చెప్పాలి. తరుచూ ఏసీబీకి చిక్కుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అయినా సరే వారి వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆరు నెలల్లో 122 ట్రాప్ కేసులు నమోదు చేసిన ఏసీబీ.. గతేడాది 129 ట్రాప్ కేసులు నమోదు చేసింది. ఈఏడాది 6 నెలల్లోనే గతేడాది కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ఏడాది లంచం తీసుకుంటూ.. 100 మందికి పైగా ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అయ్యారు. వీరిలో రెవెన్యూ శాఖలకు సంబంధించిన అధికారులే ఎక్కువగా ఉన్నారు.
Also Read : జగన్ పై క్యాడర్ లో పెరుగుతోన్న కోపం.. కారణం ఇదే
అటు పోలీసు శాఖలో కూడా అవినీతి పెరుగుతున్న నేపధ్యంలో సర్కార్.. ఏసీబీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంచితే ఒకసారి ఏసీబీకి దొరికిన అధికారులకు తెలంగాణాలో ఉద్యోగం లభించడం కష్టంగా మారుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరికిన అధికారులకు సైతం ఇప్పటికీ పోస్టింగ్ దక్కలేదు. వీరిలో రెవెన్యూ శాఖ అధికారులే ఎక్కువగా ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళా అధికారి.. 2023 లో పట్టుబడగా ఇప్పటి వరకు ఆమెకు పోస్టింగ్ దక్కలేదు.




