Friday, September 12, 2025 11:07 PM
Friday, September 12, 2025 11:07 PM
roots

లోయర్ ఆర్డర్ బాగు పడదా..?

5 సెంచరీలు ఓ టెస్ట్ మ్యాచ్ లో చేసి ఓడిపోయిన తొలి జట్టు.. 7 క్యాచ్ లు ఒక మ్యాచ్ లో పదేళ్ళ తర్వాత వదిలేసిన తొలి జట్టు.. ఇలా భారత టెస్ట్ జట్టు గురించి చెప్పడానికి తొలి మ్యాచ్ తర్వతా చాలా చెత్త విషయాలు ఉన్నాయి. అత్యుత్తమ టెస్ట్ జట్టుగా చెప్పుకునే భారత జట్టు అత్యంత చెత్త జట్టుగా కనపడింది. బంగ్లాదేశ్ కంటే హీనంగా కనపడింది ఫీల్డింగ్ బౌలింగ్ లో. భారత ఆటగాళ్ళ ఫీల్డింగ్ ప్రమాణాలు చూసిన అభిమానులకు కడుపు మండిపోతోంది. గెలిచే మ్యాచ్ ను చేజార్చుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

Also Read : మాట నెగ్గించుకున్న అమ్రాపాలి

ఒక్క జైస్వాల్ 6 క్యాచ్ లు వదిలేయడం.. అది 200కు పైగా పరుగులు ఇంగ్లాండ్ జట్టుకు కలిసి రావడం విస్మయానికి గురి చేస్తోంది. మీరే గెలవండి అన్నట్టు సింగిల్స్, డబుల్స్ వదిలేసింది భారత జట్టు. ఎవరో ఒకరిద్దరు ఫీల్డర్స్ మినహా పెద్దగా ఆకట్టుకున్నది కూడా కనపడలేదు. ఇక కెప్టెన్ గా గిల్ నిర్ణయాలు అయితే ఆశ్చర్యపరిచాయి. కీలక సమయంలో బౌలింగ్ చేంజ్ చేయడం, పరుగులు ఇస్తున్న బౌలర్ కు పదే పదే బంతిని ఇవ్వడం విస్మయానికి గురి చేసింది.

Also Read : బనకచర్లపై చంద్రబాబు సంచలన కామెంట్స్.. రాజకీయం కోసమే తెలంగాణా డ్రామాలు..!

ఇక భారత లోయర్ ఆర్డర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కనీసం లోయర్ ఆర్డర్ లో 20 పరుగులు చేసిన ఆటగాడు కనపడలేదు జట్టులో. బ్యాట్ పట్టుకోవడం కూడా రాని ఆటగాళ్ళు లోయర్ ఆర్డర్ లో ఉండటం షాక్ కి గురి చేసింది. బౌలింగ్ ఆల్ రౌండర్ గా జట్టులోకి వచ్చిన శార్దుల్ ఠాకూర్, సీనియర్ ఆల్ రౌండర్ జడేజా జట్టుకు ఖచ్చితంగా భారమే. ప్రసిద్ కృష్ణ 5 వికెట్లు తీసాడనే గాని వన్డేల మాదిరి పరుగులు సమర్పించుకున్నాడు. వచ్చే మ్యాచ్ కి అయినా జట్టులో మార్పులు జరగకపోతే ఒక్క మ్యాచ్ కూడా గెలవడం కష్టమే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్