Friday, September 12, 2025 10:41 PM
Friday, September 12, 2025 10:41 PM
roots

హేయ్… మీ ఆట తీరు మారదా..‌!

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ ఆటగాళ్ల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తొలి మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ సాధించిన టీమిండియా.. అడిలైడ్ టెస్ట్ లో మాత్రం పేలవమైన ఆటతీరుతో విమర్శల పాలవుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కెప్టెన్ రోహిత్.. తప్పుడు నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తుంది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో చేసిన తప్పులు రెండో ఇన్నింగ్స్ లో సరిదిద్దుకున్నట్లే కనిపించిన టీమ్ ఇండియా.. రెండు టెస్టులో పేలవమైన ఆటతీరుతో విమర్శల పాలవుతున్నారు.

Also Read: టీం ఇండియాకు వెన్నెముకగా మారిన తెలుగోడు

రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆలౌవుట్ అయిన టీమిండియా… రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే తరహా ఆట తీరు ప్రదర్శిస్తోంది. కంగారు జట్టు పరుగులు వరద పారిచ్చిన పిచ్ పైన… భారత్ ఆటగాళ్లు ఆపసోపాలు పడుతున్నారు. ఇలా రావడం.. అలా వెళ్లడం అన్నట్లుగా టీమిండియా ఆట తీరు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా జట్టు 340 స్కోర్ చేస్తే… టీమిండియా మాత్రం 200 దాటడమే కష్టంగా కనిపిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 180 చేసిన జుట్టు… రెండో ఇన్నింగ్స్ లో 128 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ చేరిన పరిస్థితుల్లో ఇప్పటికీ 29 రన్స్ వెనుకే ఉంది.

Also Read: అదాని నిన్ను ఎంతకు కొన్నాడు చంద్రబాబు..?

మరో మూడు రోజుల ఆట ఇంకా ఆడాల్సి ఉంది. వాస్తవానికి కంగారూలు తొందరగానే టీమిండియాకు అవకాశం ఇచ్చారు. కానీ రోహిత్ టీం మాత్రం… ఏదో అర్జెంట్ పని ఉన్నట్లు… ఇలా వచ్చి అలా వెళ్లింది. వన్డే తరహాలో ఆడుతున్నారు తప్ప… టెస్టు మ్యాచ్ అనే సోయ కూడా లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కరు కూడా వచ్చి నిలబడి వికెట్లు కాపాడుకుందాం అనే ఆలోచన లేకుండా అవుట్ అవ్వడం అభిమానులని నిరాశకు గురిచేస్తుంది. టెస్ట్ మ్యాచ్ లో కూడా 5 పైగా రన్ రేట్ ఉందంటే.. ఆటగాళ్ళు ఎలా ఆడుతున్నారో అర్ధం అవుతుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు పుంజుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్