ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ముగ్గురు మంత్రుల పేర్లు మారుమోగిపోతున్నాయి. వారే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా బయటపెడుతూ, వైసీపీ తీరును ఎండగడుతున్న విధానంపై ఆసక్తికర చర్చ మొదలైంది. వీరి ప్రెస్ మీట్లు చూస్తుంటే వైసీపీ నేతలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. బొత్సా ఏడుపు దీనికి ఉదాహరణ అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Also Read : కేసీఆర్ యుద్ధం షురూ.. క్యాడర్ లో కొత్త జోష్..!
ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెట్టడమే కాకుండా.. వైఎస్ మరణం తర్వాతి పరిణామాలను ఆయన ఎండగడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో, బొత్సా వ్యవహారంలో పయ్యావుల కామెంట్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇదే రేంజ్ లో వైఎస్ జగన్ మనస్తత్వం, వైసీపీ రాజకీయ వ్యూహాలు, రాజధాని అంశం సహా పలు కీలక విషయాలపై ఓ ఆట ఆడుకుంటున్నారు.
Also Read : ఇరాన్ పై అమెరికా ఏఐ వార్..? ట్రంప్ ఏమన్నారు..?
బొత్సాపై వ్యాఖ్యలతో ఒక్కసారిగా అచ్చెన్న సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఈ వ్యాఖ్యలు తనకు ఇబ్బందికరంగా మారే ఛాన్స్ ఉండటంతో బొత్సా అలెర్ట్ అయ్యారు. కన్నీళ్ళ అస్త్రం ప్రయోగించారు. ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా కూడా దూకుడు ప్రదర్శించలేదు. ఇదే టైం లో టీడీపీ సోషల్ మీడియా గతాన్ని గుర్తు చేసింది. ఇలా ఈ ముగ్గురు మంత్రుల పొలిటికల్ అటాక్ వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం విమర్శలే కాకుండా, సాక్ష్యాధారాలను బయటపెడుతుండటంతో ఆసక్తికర చర్చ మొదలైంది. వీరి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

