ఏది ఏమైనా రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. మనం చూసే దానికి లోపల జరిగే వ్యవహారాలకు అన్ని వింతగానే ఉంటాయి. అంచనా వేసుకున్నవి జరగకపోగా అసలు జరగవు అనుకున్నవి మాత్రం సెన్సేషన్ అవుతూ ఒక సినిమా చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విషయం బాగా హాట్ టాపిక్ అవుతుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఏపీ క్యాబినెట్లోకి సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల , ధూళిపాళ్ల నరేంద్ర.. వచ్చే అవకాశం ఉందని చాలామంది ఎదురు చూశారు. కొత్త మంత్రుల పేర్లు వినపడుతున్న సమయంలోనే వీరి పేర్లు కూడా కాస్త చేర్చకు వచ్చాయి.
Also Read : రిపోర్ట్ ఏది..? ఎన్ని సార్లు అడగాలి..? చంద్రబాబు సీరియస్
2014 తర్వాత 2017లో క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఆ సమయంలో కూడా వీరిద్దరి పేర్లు ప్రధానంగా చర్చికి వచ్చాయి. ఇక 2024లో టిడిపి మళ్ళీ అధికారంలోకి రావడంతో మరోసారి వీళ్ళ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఈసారి ఎన్నడు లేని విధంగా కొత్త మంత్రులకు చంద్రబాబు నాయుడు అవకాశాలు కల్పించారు. కానీ ధూళిపాళ్ల నరేంద్రకు గాని గోరంట్లకు గాని అవకాశం ఇవ్వడానికి చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వీళ్ళ కుటుంబాలు పార్టీతోనే ఉన్నాయి. ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా కేసులు పెట్టిన వీరు మాత్రం పార్టీ మారడానికి ఇష్టపడలేదు.
2019లో జగన్ గెలిచిన తర్వాత ప్రధానంగా ధూళిపాళ్లని ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆ సమయంలో ఆయనకు కాస్త ఆరోగ్యం కూడా దెబ్బతిన్న పరిస్థితి. లేని అవినీతి చేశారు అంటూ ఆయనను జైలుకు కూడా పంపించారు అప్పట్లో. కానీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఆయన వ్యాపారాలపై కూడా అప్పట్లో జగన్ దృష్టి సారించి ఇబ్బందులు పెట్టేందుకు రెడీ అయ్యారు. వాటిని తట్టుకుని ధూళిపాళ్ల నిలబడ్డారు. ఇక గోరంట్ల పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే అని చెప్పాలి.
కానీ మంత్రి పదవి మాత్రం వీళ్ళిద్దరికీ అందర్నీ ద్రాక్షగానే మిగిలిపోయింది. 2024 లో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వారికి కీలక పదవులు దక్కిన వీళ్ళకు మాత్రం మంత్రి పదవులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపించలేదు. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏమిటి అంటే జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సోదరుడు పడిన కష్టానికి గుర్తింపుగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడును కోరగా వెంటనే చంద్రబాబు నాయుడు కూడా ఓకే చెప్పారు.
Also Read : స్వామి దర్శనం అవ్వాలంటే.. జేఈవో దయ ఉండాల్సిందేనా?
వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది కూడా. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కొన్ని ఇప్పుడు టిడిపి సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతున్నాయి. నాగబాబు స్థానంలో ఎవరున్నా సరే మంత్రి పదవి ఇస్తామని.. పార్టీ కోసం నాగబాబు 10 ఏళ్ల నుంచి చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఉన్న టిడిపి నేతలు పవన్ కళ్యాణ్ కు ఉన్న విశ్వాసం కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి లేదని.. ధూళిపాళ్ల నరేంద్ర అలాగే గోరంట్ల ఏం పాపం చేశారంటూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. అప్పుడప్పుడు బయటకు వచ్చే నాగబాబుకి పవన్ కళ్యాణ్ అంత విలువ ఇస్తే పార్టీ కోసం జీవితాలను సైతం త్యాగం చేయడానికి రెడీ అయిన వారికి చంద్రబాబు ఇచ్చే గుర్తింపు ఇదా అంటూ పార్టీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.




