Saturday, September 13, 2025 06:58 AM
Saturday, September 13, 2025 06:58 AM
roots

అసెంబ్లీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన అయ్యన్న

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. నేడు వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. ఇక బీఎస్సి సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. సమావేశానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. – జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసారు.

Also Read : పోలీసుల ఉచ్చులో సజ్జల

ఈ నెల 22వరకూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలన్నారు అయ్యన్న. రేపు బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read : ఏపీ పోలీసులకి బెదిరింపు ఫోన్ కాల్స్

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీసారు. అందరికీ ఒకేలా భోజనం పెట్టామని… అధికారులు సమాధానం ఇచ్చారు. ఒకేలా భోజనం పెడితే నేనెందుకు నిలదీస్తానన్న సభాపతి… తనకు ఫిర్యాదులు ఎందుకొచ్చాయో సమాధానం చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. పదార్థాలు ఒక్కటే కానీ అన్నం ఒక్కటే మారిందని వివరణ ఇచ్చారు. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు సభాపతి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్