తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇటీవల విజయవాడ ఎంపీ కేసినేని చిన్నీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, టిడిపి గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ పై కొలికపూడి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వీడియో విడుదల చేసారు. అసలు కొలికపూడి బయటికి వస్తే ఎంపీ కేశినేని చిన్ని తిరువూరు నియోజకవర్గంలో అడుగుపెట్టలేడంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
Also Read :తండ్రీ, కొడుకుల పర్యటనలు సూపర్ హిట్..? తెలుగు వారిలో జోష్..!
ఎమ్మెల్యే కొలికపూడి దాడి ఎంపీ కేశినేని శివనాథ్ మీద మాత్రమే కాదు.. టిడిపి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై చేసినట్లే అన్నారు. ఎమ్మెల్యే కొలికపూడి తిరువూరు నియోజవకర్గంలోకి ఎవరికి స్వాగతం పలుకుతారో సమాధానం చెప్పాలని నిలదీసారు. నీ జెంటిల్మెన్ కేశినేని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లతో పాటు వైసిపి నాయకులకి స్వాగతం పలుకుతావా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొలికపూడి తన అక్రమ దోపిడికి తెలంగాణలో జగన్ అనుచరుడిన్ని నియమించుకుంది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు నిన్ను తిరువూరు పంపిస్తే నెత్తిన పెట్టుకుని గెలిపించుకున్నామన్నారు.
Also Read : హైడ్రా కమీషనర్ రంగనాథ్ – పవన్ కళ్యాణ్ భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
ఇప్పుడు అసలైన కొలికపూడి బయటికి వస్తే అంటూ బెదిరిస్తున్నావు.. ఏంటి అర్ధం.. వైసిపి ముసుగు తీసి వస్తావా అంటూ మండిపడ్డారు. నీది తిరువూరు నియోజకవర్గం కాదు.. కనీసం ఎన్టీఆర్ జిల్లా కూడా కాదు. నాలుగు జతల బట్టలు సంచిలో పెట్టుకుని తిరువూరు లో అడుగుపెడితే తిరువూరు నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారన్నారు. ఎమ్మెల్యే కొలికపూడికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని అధిష్టానం నుంచి ఒక ప్రకటన వస్తే… ఒక గంట తిరువూరులో వుండే ధైర్యం నీకు వుందా? అని ప్రశ్నించారు. ఎవరిని చూసుకుని ఈ దురంకాహరం… పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా వుండి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, నారా దేవాన్ష్ ను బూతులు తిట్టిన కేశినేని నాని నీకు జెంటిల్మెన్ అయ్యాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :ఒక్కొక్కరికి కోటి ఇచ్చే వరకూ రేవంత్ ను వదలను.. కవిత హాట్ కామెంట్స్..!
నాకు తెలియదా నీ పరిస్థితి.. పొంగులేటి నుంచి వస్తాయి… వాళ్ల నుంచి వస్తాయని చెప్పి.. చివరకు రాలేదని చెప్పలేదా అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన చందాలను కూడా దాచుకుంది వాస్తవం కాదా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నీకు దమ్ము, ధైర్యం వుంటే మీ భార్య, భర్తల రెండు సంవత్సరాల ఎకౌంట్ స్టెట్ మెంట్స్ మీడియా ముందు బయట పెట్టాలి అని సవాల్ చేశారు. నువ్వు ఈ రోజు వరకు ఎమ్మెల్యే అనే సంగతి మర్చిపోయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అబద్దాలు చెప్పుకుంటూ దాన్ని నిజమనేలా జనాలు నమ్మిస్తూ వైసిపి నాయకులతో జత కలిసి అక్రమాలు చేస్తున్నావా లేదా? గుండెలా మీద చెయ్యి వేసుకుని చెప్పు? అని నిలదీశారు.




