Wednesday, April 15, 2026 02:25 PM
Wednesday, April 15, 2026 02:25 PM

టీడీపీ నేతలపై అధిష్టానం థర్డ్ ఐ.. అడుగు తప్పితే వేటు తప్పదా..?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో పారదర్శకత, క్రమశిక్షణే పరమావధిగా టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. అయితే, ఇదే సమయంలో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల నుండి సీనియర్ నేతల వరకు అందరి కదలికలపై అధిష్టానం అత్యంత రహస్యంగా నిఘా పెట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఈసారి నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు.

Also Read : కేసీఆర్ యుద్ధం షురూ.. క్యాడర్ లో కొత్త జోష్..!

తాజా నివేదికల ప్రకారం, ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు, కీలక నేతల వ్యవహార శైలిపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. భూ వివాదాలు, సెటిల్‌మెంట్లు లేదా అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా.. వెంటనే అధిష్టానం నుండి పిలుపు వస్తోంది. నేతల పనితీరుపై మాత్రమే కాకుండా, వారి వ్యక్తిగత ప్రవర్తన, అధికారులతో వారు జరుపుతున్న మంతనాలపై కూడా ఇంటెలిజెన్స్, పార్టీ సొంత నిఘా వర్గాలు నివేదికలు సిద్ధం చేస్తున్నాయి.

ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఒకవేళ ఏ నేత అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, వారికి కనీసం సమాచారం ఇవ్వకుండానే చర్యలు తీసుకునేందుకు అధిష్టానం వెనుకాడటం లేదు. కేవలం రాజకీయ వ్యవహారాలే కాకుండా, ప్రభుత్వ శాఖల్లో నేతల జోక్యంపై కూడా నిఘా పెరిగింది. బదిలీలు, కాంట్రాక్టుల విషయంలో ఎవరైనా వేలు పెడితే సహించేది లేదని లోకేష్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.

Also Read : అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం

పార్టీ కార్యాలయంలో జరిగిన అంతర్గత సమావేశాల్లో కూడా.. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఏ చర్యను సహించం అని గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. గ్రీవెన్స్ ల విషయంలో కూడా అధిష్టానం చాలా సీరియస్ గా కనపడుతోంది. మొత్తానికి, ఏపీలో అధికారంలో ఉన్నా సరే.. టీడీపీ నేతలు ఇప్పుడు నిరంతరం ఒక కన్ను తమపై ఉందనే భయం లేదా జాగ్రత్తతో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఈ నిఘా పర్వం పార్టీలో క్రమశిక్షణను పెంచుతుందా లేదా అసమ్మతికి దారి తీస్తుందా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమలలో ఆ దర్శనం...

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర...

నా భార్యకు భద్రత...

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

వాళ్లిద్దరు కలిశారు సరే.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు...

వైసీపీ రాజకీయ పార్టీనా.....

వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు...

బ్రేకింగ్: కేసీఆర్ కు...

తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ...

అమరావతి వేదికగా సాకారమవుతున్న...

ప్రపంచ క్వాంటం డే పురస్కరించుకుని దేశ...

పోల్స్