కూటమి ప్రభుత్వం వరుస అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఏపీని పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించేందుకు కూటమి సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోంది. అదే సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎలాంటి వివక్షకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
Also Read : కర్మ సిద్ధాంతం.. వైరల్ అవుతోన్న రేవంత్ కామెంట్స్
ఐదేళ్ల పాటు ఏపీలో అధికారంలో వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగించిందనే అపవాదు మూటగట్టుకుంది. పూర్తి ఏకపక్ష నిర్ణయాలతో నియంతను తలపించేలా జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా చేయాలనుకున్న పనులు చేశారు తప్ప.. ప్రజాభిప్రాయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్.. ఎన్నికల తర్వాత మాత్రం.. మూడు రాజధానులంటూ మాట మార్చారు. దీంతో జనం కూడా జగన్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు.
Also Read : రాజీనామాకు సిద్ధమైన అక్క శిష్యులు..? గులాబీ పార్టీలో అలజడి
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా నిర్ణయానికి అనుకూలంగా పరిపాలన సాగిస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. ఏ పని చేస్తున్నా.. దానిపైన ప్రజల అభిప్రాయం తీసుకుంటోంది. ఏపీ సీఆర్‌డీఏ పరిధిలో జరుగుతున్న రాజధాని నిర్మాణ పనుల్లో ప్రజా నిర్ణయానికే ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ప్రస్తుతం సీఆర్‌డీఏ రీజనల్ కార్యాలయ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దీనికి సంబంధించిన డిజైన్ విషయంలో ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్న ప్రభుత్వం.. ఆ తర్వాత భవనం బయట వేసే లైటింగ్ గురించి కూడా ఓపీనియన్ పోల్ పెట్టింది. ఇప్పుడు తాజాగా కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ గురించి పోల్ అందుబాటులో ఉంచారు. నాలుగు నమూనాలను ఇప్పటికే సోషల్ మీడియాలో ఉంచిన అధికారులు.. ఎక్కువ మంది ఆమోదించిన బ్రిడ్జ్‌కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటింగ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.




