ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాజీ మంత్రులను టార్గెట్ చేసిందా…? అధికారం ఉంది కదా అని రెచ్చిపోయిన నాయకులకు గురి పెట్టిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను, వారి కుటుంబాల్లో ఉన్న మహిళలను పచ్చి బూతులు తిడుతూ పాలన చేసింది ఇంకా ప్రజల కళ్ళ ముందు ఉంది. ముఖ్యంగా అంబటి రాంబాబు, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జోగి రమేష్, కొడాలి నానీ సహా కొందరు నోటికి పని చెప్పి చిన్నా పెద్దా లేకుండా కామెంట్స్ చేసారు.
ఇప్పుడు వారి అందరి మీద సర్కార్ గురి పెట్టింది. కీలక శాఖల్లో మంత్రులుగా చేసిన నాయకుల ఆట కట్టించేందుకు సిద్దమైంది. మొన్న పెద్దిరెడ్డి, నిన్న కారుమూరి, నేడు జోగి రమేష్… రేపు ధర్మాన ఇలా ఒక్కొక్కరిని గురి పెట్టి కొట్టేందుకు సిద్దమవుతుంది. మీరు మా మీద లేని కేసులు పెట్టారు. మీ మీద ఉన్న కేసులే పెడతాం అంటూ టీడీపీ సర్కార్ సిద్దమవుతుంది. డీడీఆర్ బాండ్ల వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాత్రపై దృష్టి పెట్టి అంతర్గత విచారణను సర్కార్ ముమ్మరం చేయనుంది.
ఇక పెద్దిరెడ్డి అక్రమాలకూ సంబంధించి స్పీడ్ పెంచడంతో ఏకంగా ప్రభుత్వ కార్యాలయానికే నిప్పు పెట్టిన పరిస్థితి. ఆయనను త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు జోగి రమేష్ మీద గురి పెట్టి కొట్టారు. నేడు ఉదయం 5 గంటల నుంచి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఆ తర్వాత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ ఏ 1 గా ఉన్నాడు. దీనితో రాజీవ్ ను అరెస్ట్ చేసారు. సాయంత్రం రమేష్ ను ఏసీబీ కార్యాలయంలో విచారిస్తారు. ఇక తర్వాతి టార్గెట్ ధర్మాన కృష్ణ దాస్ అని తెలుస్తోంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కూడా సర్కార్ దృష్టి సారించింది.