ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై సీరియస్ గా ఫోకస్ చేసింది. కీలక శాఖల్లో జరిగిన భారీ అవినీతిపై ఇప్పటికే అంతర్గత విచారణ పూర్తి అయింది. అయితే కొందరు అధికారులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాట కూడా లెక్క చేయకుండా కీలక శాఖల్లో చేపట్టిన అంతర్గత విచారణలో తూతూ మంత్రంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. టీడీఆర్ బాండ్ ల విషయంలో ప్రభుత్వం వద్ద సమాచారం ఉన్న నేపధ్యంలో అవినీతిపై కీలక విచారణకు ఆదేశించింది.
Also Read : అలా మన తెలుగు హీరోలు చేయలేరా…?
కానీ అధికారులు మాత్రం ఈ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించారు. దీనితో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విచారణ పై సిఎం ఆసంతృప్తి వ్యక్తం చేసారు. బాధ్యులైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవడంలో పురపాలకశాఖ నిర్లక్ష్యం వహించడం పట్ల చంద్రబాబు సీరియస్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఈ విభాగంలో పనిచేసిన కీలక అధికారులకే విచారణ బాధ్యతలు అప్పగించడంతో విచారణ ముందుకు సాగలేదు.
ఈ విషయంలో పురపాలకశాఖ మంత్రి నారాయణను కొందరు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు రావడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై ఇటీవల నిర్వహించిన సమీక్షలోనూ టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేసి, బాధ్యులను గుర్తించాలని చంద్రబాబు సూచించారు. టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలపై ప్రభుత్వ ఆదేశాలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరపగా చూసి చూడనట్టు వ్యవహరించారు అనే ఆరోపణలు వచ్చాయి.
Also Read : ఫోర్జరీ చేశారు… మరింతగా ఇరుక్కున్నారు..!
భారీగా అవకతవకలు జరిగాయని ఫిర్యాదులొచ్చిన పుర, నగరపాలక సంస్థల్లో తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నా విచారణ మాత్రం ముందుకు వెళ్ళలేదు. ఇక తిరుపతి నగరపాలక సంస్థలు, బొబ్బిలి పురపాలక సంఘంలోనూ గత ప్రభుత్వంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై విజిలెన్స్ ప్రత్యేక బృందాలు విచారణ జరిపాయి. గుంటూరు ఉభయగోదావరి జిల్లాలో త్వరలో విచారణ చేయనున్నారు అధికారులు.