ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు చాలా మంది చాలా అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే సామాన్య ప్రజల్లో టిడిపి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వైసిపి అనేక రకాలుగా ఇబ్బంది పడుతుందని వైసీపీలో రెచ్చిపోయిన ప్రతి నాయకుడికి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ సమాధానం చెప్తారని, నారా లోకేష్ రెడ్ బుక్ కచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన నాయకులందరికీ చుక్కలు చూపించడం ఖాయమని అంచనాలు వేశారు.
Also Read : వెంకన్న భక్తులకి బ్యాడ్ న్యూస్..!
అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో కంటే తెలుగుదేశం పార్టీలో వైసిపి నేతలు చాలా స్వేచ్ఛగా కనపడుతున్నారు. చాలామంది వైసిపి నేతలు తెలుగుదేశం పార్టీ నేతలతో స్నేహం చేయడం మొదలుపెట్టారు. తాజాగా జోగి రమేష్ కూడా తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పోయారు. నూజివీడులో జరిగిన ఒక కార్యక్రమంలో జోగి రమేష్ అలాగే పలాస ఎమ్మెల్యే గౌత శిరీష, మంత్రి పార్థసారథి కలిసి ఒకే వాహనంపై వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : బాలకృష్ణ ఇంటికి టీ సర్కార్ నోటీసులు… కూల్చేస్తారా…?
జోగి రమేష్ వైసీపీలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్లారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలను ఆయన, ఆయన గారి కుమారుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ భూముల్లో అవినీతికి కూడా పాల్పడ్డారు అనే ఆరోపణలు వినిపించాయి. మొన్నామధ్య కాస్త హడావుడి కూడా జరిగింది. అలాంటి జోగి రమేష్ ను తెలుగుదేశం పార్టీ నేతలు పక్కన పెట్టుకొని తిరగటం పట్ల ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు.
తాము ఆశలు పెట్టుకొని తప్పు చేశామని… అసలు తప్పంతా కార్యకర్తలదే అని… నాయకులను గుడ్డిగా నమ్మి ఏదో జరిగిపోతుందని తమను ఇబ్బంది పెట్టిన వారిని… కనీసం నాయకులను ఇబ్బంది పెట్టిన వారిని పైన చర్యలు తీసుకుంటారని బూతులు మాట్లాడిన వారికి కఠిన చర్యలు ఉంటాయని చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని అనవసరంగా ఎదురుచూశామని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు.