ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు వారి విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు కాస్త దూకుడుగానే అడుగులు వేస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ప్రధాన అనుచరుడు మోహనరంగాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబు పై దాడి కేసులో వంశీ అనుచరులను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాతో పాటు మరికొందరు ఉన్నారని పోలీసులు గుర్తించారు.
Also Read : బోరుగడ్డకు రాచమర్యాదలు వెనుక ఉన్న పోలీసు పెద్దలెవరు?
తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. 2024 జనవరి 21వ తేదీన గన్నవరం పీఏసీఎస్ఓ మాజీ అధ్యక్షుడు, తెలుగుదేశం నేత కాసరనేని రంగబాబుపై వంశీ అనుచరులు దాడి చేయగా ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డారు. గన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పార్క్ ఎలైట్ హోటల్ వద్ద పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేసింది వంశీ అనుచరులే అని రంగబాబు ఫిర్యాదు చేసారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం కావడంతో పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించారు.
Also Read : పుష్ప పేరుతో వైసీపీ సోషల్ మీడియా పొలిటికల్ వార్
ఇప్పటికి కేసులో కదలిక వచ్చి పోలీసులు రంగంలోకి దిగారు. గన్నవరం పోలీసు స్టేషన్‌లో గత ఏడాది క్రైం నెంబరు 42గా ఈ దాడి కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనలో తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు. వారిపై సెక్షన్ 326, 120 బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి… ఎనిమిది బృందాలతో ఏకకాలంలో పోలీసులు ఇవాళ తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులైన ఓలుపల్లి మోహనరంగా, అనగాని రవి, భీమవరపు యేతంధ్ర రామకృష్ణ అలియాస్ రాము, మేచినేని బాబు, సూరపనేని అనీల్, గోన్నూరి సీమయ్య, గుర్రం నానీని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పలువురు వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ లు చేసారు.