Tuesday, October 28, 2025 04:48 AM
Tuesday, October 28, 2025 04:48 AM
roots

ప్రజలు “ఛీ” కొట్టినా సిగ్గురాలేదా అప్పలరాజు?

పలాస ప్రజలు ఛీ కొట్టినా సీదిరి అప్పలరాజు సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, మెడికల్ కాలేజ్ సీట్లు తగ్గిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం సిగ్గుచేటు అంటూ టిడిపి మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. అప్పలరాజుకి మెడికల్ కండిషన్ సరిగా లేకనే మెడికల్ సీట్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మంత్రిగా వెలగబెట్టిన అప్పలరాజుకి రాష్ట్రంలో ఎమ్మెల్సీ సీట్ల సంఖ్య ఎంతో తెలియదంటూ ఎద్దేవా చేశారు, ఆయన మెడికల్ సీట్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభించారు తప్ప ఒక్కటైనా పూర్తి చేశారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. పూర్తి చేసి ఉంటే మీడియా సాక్షిగా చూపించాలన్నారు.

TDP EX MLC Mantena Satyanarayana Raju

ప్రకటించిన వాటిల్లో సగానికి పైగా కాలేజీల నిర్మాణం పునాది దశలో ఉందని, నిర్మాణం పూర్తికాకుండానే గతేడాది రాజమండ్రి కళాశాల ప్రారంభించారని ఆరోపించారు. ప్రస్తుతం రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతి గదులు లేవు. తాత్కాలిక భవనాల్లో తరగతులు నడపాలిన పరిస్థితి నెలకొంది. ఇంకా సిగ్గు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పులివెందుల వైద్య కళాశాలలో 48 శాతం బోధనా సిబ్బంది లేరుని, జగన్ కి ప్రచార ఆర్భాటం తప్ప 5 ఏళ్ల లో ప్రజలకు చేసింది ఏమీ లేదని, అప్పలరాజు ఇకనైనా నోరు తగ్గించుకోకుంటే తిప్పలు తప్పవు అని హెచ్చరించారు. ఇదే పద్దతి కొనసాగితే ప్రజలే తిరగబడటం ఖాయమన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్