Wednesday, October 22, 2025 03:06 PM
Wednesday, October 22, 2025 03:06 PM
roots

శ్రీలేఖకు టీడీపీ క్యాడర్ మద్దతు.. ప్రభుత్వంపై విమర్శలు

రాజకీయాల్లో ప్రభుత్వ అధికారుల పాత్ర కాస్త సంచలనమే. అధికారుల వ్యవహార శైలి అధికార పార్టీలకు కలిసి వచ్చే సందర్భాలు ఉంటాయి, ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు విశాఖ జిల్లాలో ఇద్దరు అధికారుల మధ్య రేగిన వివాదం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి ఇది ప్రధాన కారణమైంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా, టిడిపికి వ్యతిరేకంగా పనిచేశారు. మరి కొంతమంది అధికారులు ధైర్యంగా ముందుకు వెళ్లి సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నారు.

Also Read : ఆ పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారో..?

అయితే ధైర్యంగా పనిచేసిన అధికారులను ఇప్పుడు గుర్తించడం లేదని విమర్శలు వచ్చాయి. తాజాగా విశాఖలో డిఆర్ఓ గా పనిచేసిన భవాని శంకర్ విషయంలో ఆర్డీవో శ్రీలేఖ చేసిన అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో ఆయన కుటుంబం ఉంటే విశాఖ నుంచి ప్రతినెల 20 వేల రూపాయలు విలువైన కిరాణా సరుకులను ప్రభుత్వ ఖాతాలో కొనుగోలు చేస్తున్నారని, వాటిని సిబ్బంది ద్వారా అక్కడికి పంపిస్తున్నారని ఆమె.. విశాఖ కలెక్టర్ కు లేఖ రాశారు. ఆ వెంటనే అధికారులు ఆమెపై చర్యలకు దిగారు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే.. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించినందుకు కలెక్టర్ ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు.

Also Read : ఉప్పు, పప్పు కూడా ప్రభుత్వ సొమ్ముతోనే.. “లేఖ” దుమారం..!

ఇక ఆ వెంటనే ఆమెను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ఆదేశాలు వెళ్లాయి. ఆమెతోపాటుగా భవాని శంకర్ ను సైతం జిఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఇదే టిడిపి కార్యకర్తల అగ్రహానికి కారణమైంది. 2024లో ఎన్నికల సమయంలో ఎర్రగొండపాలెం లో శ్రీలేఖ రిటర్నింగ్ ఆఫీసర్ గా పని చేశారు. ఆ సమయంలో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై ఆమె పోరాటం చేశారు. ఆ ఎన్నికల్లో చెవిరెడ్డి పై ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి శ్రీలేఖను బెదిరించిన కేసు కూడా ఉంది. అప్పట్లో ఆమె ధైర్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. అలాంటి అధికారిని.. మరో అధికారిపై అవినీతి ఆరోపణలు చేస్తే.. విచారణ లేకుండా ఏ విధంగా బదిలీ చేస్తారు అంటూ టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మరికొందరు కీలక నేతలపై కూడా విమర్శలు చేస్తున్నారు టిడిపి కార్యకర్తలు. సీఎంఓలో ఉన్న ఓ కీలక అధికారి ఆమెకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా ఆమెను బదిలీ చేసిన విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా...

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

పోల్స్