ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా.. కాంట్రాక్టర్ లకు, ఉద్యోగులకు, విద్యార్ధులకు ఉన్న బకాయిలను తీర్చే ప్రయత్నాలు చేస్తోంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గత 5 ఏళ్ళుగా వైసీపీ సర్కార్ రోడ్లను పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో కూడా రోడ్ల నిర్మాణాల మీద దృష్టి సారించలేదు అనే విషయం అందరికి క్లారిటీ ఉంది.
Also Read : అవును.. ఆ ఇద్దరికి వాళ్లే సమస్య..!
ఇక ఉద్యోగుల బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. విమర్శలు రాకుండా చర్యలు తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఉద్యోగ సంఘాల నేతలు, వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం విషయంలో మాత్రం టీడీపీ నేతలు మౌనంగా ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకుడు ఒకరు మాట్లాడుతూ 20 వేల కోట్ల బకాయిలు ఉంటే పది శాతం కూడా ఇవ్వలేదని, సిఎం కలవడానికి ఇష్టపడటం లేదు అంటూ విమర్శలు చేసారు. దీనిని సాక్షి పెద్ద ఎత్తున హైలెట్ చేసింది.
Also Read : జూన్ నెలలో పేలనున్న లిక్కర్ బాంబు..?
వాస్తవానికి 7 వేల కోట్లకు పైగా ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది కూటమి సర్కార్. ఎప్పటి నుంచో రాని బకాయిలను కూడా చెల్లించారు. అయినా సరే వాటి విషయంలో టీడీపీ గాని కూటమి నేతలు గాని ప్రచారం చేసుకోలేకపోవడం గమనార్హం. ఇక విద్యార్ధులకు చెల్లించిన బకాయిల గురించి కూడా కూటమి మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అటు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా కూటమి నేతలు మౌనంగా ఉండటం పట్ల విమర్శలు వస్తున్నాయి. కనీసం సాక్షి చేస్తున్న తప్పుడు ప్రచారాలను కూడా ఖండించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు.