Friday, September 12, 2025 01:24 PM
Friday, September 12, 2025 01:24 PM
roots

సాక్షి ఇచ్చిన షాక్ లో వైసీపీ నేతలు..!

వైసీపీ నేతలు షాక్ లో ఉన్నారు. జూన్ 4న వచ్చిన ఎన్నికల ఫలితాల రోజు తగిలిన షాక్ కంటే కూడా సాక్షి పత్రిక ఇచ్చిన షాక్ మామూలుగా లేదంటున్నారు వైసీపీ నేతలు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు… అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరనేది అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి నేతలను తిట్టడమే అజెండా అన్నట్లుగా వైసీపీ అధిష్టానం వ్యవహరించింది. దీనివల్ల సొంత పార్టీ నేతలు భవిష్యత్తులో ఇతర పార్టీలోకి వెళ్లకుండా పూర్తిగా అడ్డుకట్ట వేశారు. అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్ తీరు మాత్రం ఇప్పుడు నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Also Read : ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఏలూరి ముద్ర

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సాక్షి పత్రిక మొదటి పేజీలో పెద్ద యాడ్ ప్రచురించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నివాళి తెలుపుతూ ఇచ్చిన యాడ్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళితోపాటు… చంద్రబాబు, లోకేష్ ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. అలాగే “లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారికి కోటి సభ్యత్వాలతో ఘన నివాళి” అంటూ తాటికాయంత అక్షరాలతో రాశారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలకు ఏమాత్రం మింగుడు పడటం లేదు.

Also Read : కొలికపూడికి మూడినట్టేనా…?

నిన్నటి వరకు తిట్టిన తిట్టు తిట్టకుండా… చంద్రబాబు, లోకేష్ పైన నోటికి వచ్చినట్లు రాసిన పత్రికలో ఒక్కసారిగా ఇలా పొగడ్తలతో యాడ్ రావటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. పత్రిక అంటేనే వ్యాపారం.. అయితే తెలుగు మీడియాలో సాక్షి వచ్చిన తర్వాత రాజకీయాలకు ఆపాదించడం మొదలైంది. టీడీపీకి ఎవరైనా అనుకూలంగా వార్త రాస్తే.. వారిపై ఎల్లో మీడియా అంటూ ముద్ర వేశారు వైసీపీ నేతలు. వాస్తవానికి సాక్షి మీడియాలో ఇప్పటి వరకు టీడీపీకి సంబంధించి ఎలాంటి యాడ్ రాలేదు. మొదటి సారిగా అది కూడా ఫ్రంట్ ఫుల్ పేజీ యాడ్ కావటంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. టీడీపీ నేతలను తిట్టాలని రోజూ చెప్పే పార్టీ పెద్దల ఆధ్వర్యంలో నడిచే పత్రికలో ఇలా యాడ్ వేయటం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. వైసీపీ పెద్దలు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయం రాజకీయమే… వ్యాపారం వ్యాపారమే అని కొందరు నేతలు అంటుంటే… ఇప్పటినుంచి టిడిపి నేతలపై విమర్శలు చేయాలా వద్దా అని అర్థం కావటం లేదంటున్నారు మరికొందరు నేతలు. మొత్తానికి సాక్షి పత్రిక ఇచ్చిన షాక్ తో వైసీపీ నేతలు ఇప్పట్లో కోలుకునేలా లేరు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్