Friday, September 12, 2025 01:12 PM
Friday, September 12, 2025 01:12 PM
roots

టీసీఎస్ నిర్ణయం వెనుక కారణం అదేనా..?

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్” ఇప్పుడు ఈ మాట ఐటి ఉద్యోగుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. తమ ఉద్యోగాలకు డోకా లేదని భావించిన లక్షలాది మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ప్రముఖ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తీసుకున్న ఓ నిర్ణయం దెబ్బకు ఐటి ఉద్యోగుల్లో ఆందోళన తారా స్థాయికి చేరుకుంది. ఏకంగా 12 వేల మందిని ఒక్క దెబ్బకు లేపేసింది టాటా యాజమాన్యం. తమ ఉద్యోగుల్లో రెండు శాతం ఉద్యోగులను తగ్గించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు అవుతుందని తెలిపింది.

Also Read : గజపతి రాజు సిగరెట్ కష్టాలు.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఐటీ ఆఫీసుల్లో మొత్తం దాదాపు 6,13,000 మందిని ఈ సంస్థ నియమించింది. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు వారిని తొలగించే ప్రక్రియ మొదలుపెట్టింది. ఎక్కువగా సీనియర్ ఉద్యోగులనే ఆ సంస్థ టార్గెట్ చేసింది. అయితే డివిజన్ లేదా డిపార్ట్‌మెంట్ ల వారీగా ఉద్యోగులను తొలగించిందా లేదా అనేది స్పష్టత లేదు. దీనిపై కంపెనీ సిఈఓ కే. కృతివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తొలగింపులకు ఏఐ కారణం కాదంటూనే ఏఐ కారణంగా 20 శాతం ప్రొడక్షన్ లాభాలు వచ్చాయని చెప్పడం గమనార్హం.

Also Read : బీహార్ లో కుక్కకు అడ్రస్ సర్టిఫికేట్.. నకిలీ ఓటు కోసం..?

ముఖ్యంగా నైపుణ్య లోపాలు, కొందరు ఉద్యోగులకు ప్రమోషన్ లు ఇవ్వలేకపోవడం వంటి కారణాలతో తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్ లను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఏఐ విషయంలో సంస్థ కీలక అడుగులు వేస్తోందని, ప్రస్తుతం తొలగించిన ఉద్యోగులతో సంస్థకు ప్రయోజనం లేదని తెలిపారు. త్వరలోనే కీలక సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్ మరియు సేల్స్‌ ఫోర్స్ వంటి బిగ్ టెక్ కంపెనీలు కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. ఏఐ 50 శాతం వరకు కోడింగ్ రాయడంతో ఉద్యోగులను పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్