తెలంగాణలో మంత్రి పదవుల విషయంలో ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. దాదాపు 6 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ పై ఏదో ఒక రూపంలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరికి మంత్రి పదవి ఖరారు అవుతుందంటూ ఏదో ఒక మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పై చర్చ మొదలైంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా మైనార్టీలు కూడా మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : జగన్ పాపాలు.. మన ప్రాజెక్టులు సెఫేనా..?
ఇప్పటివరకు కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదు. దీనితో కొంతమంది కీలక నేతలు తమకు గతంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ అగ్ర నేతలు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నారు. ఇక తాజాగా కొంతమంది ఆశావాహులు బయటికి వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి వంటి వారు అడ్డుకుంటున్నారని.. నిరంతరం ప్రజల కోసం తపించే నాయకుడికి మంత్రి పదవి రావాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : తుంగభద్ర ప్రాజెక్ట్ పై సంచలన నివేదిక
ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం పోటీలో ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లో తాను ఒక్కడినే కాంగ్రెస్ లో బలమైన నాయకుడునీ కాబట్టి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే మంచిర్యాల జిల్లాను ముంచినట్లు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు మెదక్ అదిలాబాద్ జిల్లాలకు చెందిన కొంతమంది కీలక నేతలు సైతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు.