భారత్ వంటి దేశాల్లో ఆదాయపు పన్ను వ్యవహారం భయపెడుతూ ఉంటుంది. సంపాదన మొత్తం పన్ను రూపంలో వెళ్లిపోవడంతో ఆదాయపు పన్ను నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న 90,000 మంది జీతం తీసుకుంటున్న ఉద్యోగులు.. డిసెంబర్ 31, 2024 నాటికి రూ. 1,070 కోట్లను.. నకిలీ పత్రాలు సమర్పించి.. పన్ను మినహాయింపు విత్ డ్రా చేసుకుంటున్నట్టు గుర్తించారు.
Also Read : అసలు అమరావతిలో ఏం జరుగుతోంది..?
ఆదాయపు పన్ను శాఖ సోదాలు, ఆడిటింగ్ సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 80C, 80D, 80E, 80G, 80GGB, 80GGC వంటి వివిధ విభాగాల కింద చాలా మంది విత్ డ్రా చేసుకున్నారని గుర్తించారు. ఒకే కంపెనీకి చెందిన ఉద్యోగులు చాలా మంది ఉన్నారని తేల్చారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ జాబితాలో పెద్ద ఉన్నారని గుర్తించారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు.
Also Read : హాట్ టాపిక్‌గా బన్నీ యాటిట్యూడ్
ఈ చర్యలను అడ్డుకునేందుకు ఐటి అధికారులు ఐటీఆర్ 1, 4 ఫామ్ లను అప్డేట్ చేసింది. ఏదైనా ఇన్సూరెన్స్ చేసుకునేందుకు సెక్షన్ 80 సి క్లెయిమ్‌లకు డాక్యుమెంట్ ఐడీ లు లేదా పాలసీ నంబర్లు కావాల్సి ఉంటుంది. సెక్షన్ 80D క్లెయిమ్‌లకు ఆరోగ్య బీమా కోసం బీమా సంస్థ పేరు, పాలసీ నంబర్ అవసరం. హోమ్ లోన్ లేదా స్టూడెంట్ లోన్.. వంటి వాటికి లోన్ అకౌంట్ నెంబర్, బ్యాంకు వివరాలు, లోన్ తీసుకున్న తేదీలు కావాల్సి ఉంటుంది. సెక్షన్ 80EEB కింద ఎలక్ట్రిక్ వాహనాలకు తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం.