Friday, September 12, 2025 11:10 PM
Friday, September 12, 2025 11:10 PM
roots

ఆ ఎమ్మెల్యే పైనే తాడేపల్లి పెద్దల నిఘా…!

వైసీపీలో సొంత నేతలపైనే అధినేతకు నమ్మకం పోయిందా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీ ఓటమి తర్వాత వైసీపీలో నైరాశ్యం నెలకొంది. నాలుగు నెలలు కూడా కాకముందే కీలక నేతలంతా పార్టీ మారిపోయారు. ఇక అధినేత జగన్‌ పరిస్థితి అయితే గందరగోళంగా మారిపోయింది. వై నాట్ 175 అంటూ ఎన్నికల్లో గొప్పగా చెప్పారు జగన్. అంటే ప్రతిపక్షం అవసరం లేదు అని చెప్పారు. అయితే 11 స్థానాలు మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో అభాసుపాలయ్యారు.

ఇక ఐదేళ్ల వైసీపీ అక్రమాలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. దీంతో నేతలంతా జారుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఇప్పటికే గట్టి దెబ్బలు తగిలాయి. జగన్ సన్నిహిత బంధువు, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టీడీపీలో చేరేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో సీనియర్ నేత కరణం బలరాం కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. దీంతో బాలినేని శిష్యుడు, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై తాడేపల్లి పెద్దలు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read :

బాలినేని అండతో రాజకీయాల్లోకి వచ్చిన తాటిపర్తి.. కొండపి టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే జగన్ మాత్రం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండపికి ట్రాన్స్‌ఫర్ చేసి… ఆయన స్థానంలో తాటిపర్తి చంద్రశేఖర్‌కి యర్రగొండపాలెం టికెట్ కేటాయించారు. ఆరు నెలల పాటు భారీగా ఖర్చు చేసిన తాటిపర్తి… టీడీపీలో కొందరు సీనియర్ల సాయంతో యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా 5,200 ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే తొలి రోజు నుంచి తాటిపర్తి తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గెలిచిన తర్వాత దాదాపు నెల రోజుల వరకు పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత కూడా ఏదో మొక్కుబడిగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు.

ఇక బాలినేని పార్టీ మారటంతో తాటిపర్తి కూడా ఆయన బాటలోనే జనసేనలో చేరతారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో ఆఘమేఘాల మీద తాటిపర్తిని తాడేపల్లికి పిలిపించారు. చంద్రశేఖర్‌తో జగన్ స్వయంగా మాట్లాడారు. ముందు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ పదవిని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. దీనిపై తాటిపర్తి వర్గం గుర్రుగా ఉండటంతో… భవిష్యత్తులో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీలిచ్చారట.

అయినా సరే.. తాటిపర్తి మాత్రం బాలినేని బాటలోనే పయనించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసిన తాడేపల్లి పెద్దలు… సొంత పార్టీ ఎమ్మెల్యే కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అసలే గెలిచింది 11 మంది. వాళ్లు కూడా పార్టీ మారితే ఉన్న కాస్త పరువు కూడా పోతుందని పెద్దలు భయపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్