Tuesday, October 28, 2025 01:36 AM
Tuesday, October 28, 2025 01:36 AM
roots

గతం మర్చిపోయి పరువు పోగొట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే..!

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా… అధికారం కోల్పోయిన తర్వాత మరోలా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. సరిగ్గా 8 నెలల క్రితం వరకు అంతా మా వల్లే అని గొప్పలు చెప్పుకున్న నేతలు.. ఇప్పుడు మాత్రం కూటమి సర్కార్ ఏమీ చేయటం లేదని గగ్గొలు పెడుతున్నారు. పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కేటాయింపుల పేరుతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేస్తున్న డ్రామాలు ఆ పార్టీ నేతలను నవ్వుల పాలు చేస్తున్నాయి. వెలుగొండ ప్రాజెక్టుకు నేటి బడ్జెట్‌లో కేటాయింపులు సరిగా జరగలేదని ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడుతున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే… హడావుడిగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టారు. వెలుగొండ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.359 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రాబోయే రోజుల్లో పాదయాత్ర ద్వారా ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండకడతామన్నారు ఎమ్మెల్యే తాటిపర్తి.

Also Read : చంద్రబాబుపై జీవీ రెడ్డి వ్యాఖ్యలు.. ఇదేంటి మళ్లీ..!

అయితే ఇదే విషయంపై ఇప్పుడు వైసీపీ నేతలపై సెటైర్లు పడుతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు అనేది ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తాగు, సాగు నీరు సరఫరా చేస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను సొరంగం ద్వారా తరలించేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలో నల్లమల అటవీ మార్గంలో సొరంగం తవ్వకం పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కాకర్ల, సుంకేసుల, గొట్టిపడియ గ్యాప్‌లను పూర్తి చేశారు. కాలువ తవ్వకాలు కూడా పూర్తయ్యాయి. ప్రాజెక్టు పరిధిలోని గుండంచర్ల, గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తించి… దరిమడుగు సమీపంలో పునరావాసం కూడా ఏర్పాటు చేశారు. అయితే బోరింగ్ యత్రం ద్వారా టన్నెల్ తవ్వకం పనులు కొనసాగుతూనే ఉన్నాయి ముందు ఒక టన్నెల్‌తో డిజైన్ చేసిన ప్రాజెక్టు.. తర్వాత రెండు టన్నెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెంటనే రెండో టన్నెల్ తవ్వకం పనులు కూడా ప్రారంభించారు.

Also Read : సజ్జల అరెస్టు ముహుర్తం ఖరారైందా..?

వెలుగొండ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తామని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రకటించడాన్ని ఇప్పుడు ఆయా జిల్లాల కూటమి నేతలతో పాటు ప్రజలు కూడా తప్పుబడుతున్నారు. 2024 మార్చి 5వ తేదీన వెలుగొండ ప్రాజెక్టును నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తండ్రి శంఖుస్థాపన చేస్తే… కొడుకు పూర్తి చేసి ప్రారంభించారంటూ అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎలివేషన్లు కూడా ఇచ్చారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల తాగు, సాగునీటి కష్టాలను జగన్ తీర్చాడంటూ గొప్పలు చెప్పుకున్నారు కూడా. మరోవైపు అసలు ఎలాంటి హోదా లేకుండానే నాటి అధికారిక సభ వేదికపై తాటిపర్తి చంద్రశేఖర్ సీఎం జగన్ పక్కనే కూర్చుని చప్పట్లు కూడా కొట్టారు. మరి పూర్తి కాకుండానే ప్రాజెక్టు ప్రారంభించారా అంటూ ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ను ప్రశ్నిస్తున్నారు.

Also Read : ఏపీ రాజకీయాలపై ఓ డైరెక్టర్ సెన్సేషనల్ స్టెప్

మరోవైపు 2023-24 బడ్జెట్‌లో వెలుగొండ ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.26 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.359 కోట్లు కేటాయిస్తే తక్కువ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అలాగే గతేడాది మార్చి 5న దోర్నాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆర్ అండ్ ఆర్ ప్రాజక్టు కింద రూ.1400 కోట్లు చెక్కులు పంపిణీ చేశామని గొప్పగా చెప్పారు నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మరి ఇవాళ ఆర్ అండ్ ఆర్ కింద నిధులు కేటాయింపు చేయలేదని ఎలా అంటారు చంద్రశేఖరా అంటూ ప్రశ్నిస్తున్నారు. పూర్తి కానీ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడాన్ని నిరసిస్తూ జగన్ ఇంటికి పాదయాత్ర చేస్తే బాగుంటుంది… అప్పుడే ఓటు వేసిన ప్రజలు కూడా సంతోషిస్తారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై సెటైర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే చేయాల్సిన పాదయాత్ర తాడేపల్లి ప్యాలెస్‌కు చేస్తే మంచిది అంటూ విమర్శలు చేస్తున్నారు. గతం మర్చిపోయారా ఎమ్మెల్యే సార్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్