Tuesday, October 28, 2025 02:26 AM
Tuesday, October 28, 2025 02:26 AM
roots

తమిళ నిర్మాతల కక్కుర్తి… తెలుగు సినిమాకు అన్యాయం

వాస్తవానికి తమిళ సినిమాలు మన తెలుగులో బాగానే ఆడుతూ ఉంటాయి. తమిళ సినిమాలకు ప్రత్యేకంగా ఇక్కడ అభిమానులు కూడా ఉన్నారు. అలాగే ఇతర భాషల సినిమాలు కూడా మన తెలుగులో కాస్త ఎక్కువగానే డామినేట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఈ డామినేషన్ మరింత ఎక్కువైంది. అక్కడి స్టార్ హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు అన్నీ కూడా తెలుగులో సబ్ టైటిల్స్ తో మనవాళ్లు చూస్తూనే ఉంటారు. ఇక తమిళ్ హీరోల సినిమాలు ఇక్కడ క్రేజ్ ఉండటంతో మన థియేటర్లో యజమానులు కూడా వారి సినిమాలకు అవకాశం కల్పిస్తూ ఉంటారు.

Also Read : జగన్ బాటలో రేవంత్… వాల్యూమ్ తగ్గించాలా…?

అయితే ఇప్పుడు ఇదే చికాకుగా మారింది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మన తెలుగు సినిమాలకు తమిళంలో అవకాశాలు కల్పించకపోవడం పట్ల టాలీవుడ్ ప్రొడ్యూసర్లు కాస్త సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళ సినిమా ఏది రిలీజ్ అయినా సరే ఇక్కడ భారీగా థియేటర్లను కేటాయిస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న సినిమాలు తమిళనాడులో విడుదలవుతున్న సమయంలో వాటికి ఆదరణ లభించకపోవడం అలాగే అక్కడ థియేటర్లను కేటాయించకపోవడం పట్ల ఇక్కడి సినిమా నిర్మాతలు కాస్త సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది.

అలాగే డిస్టిబ్యూటర్లు కూడా ఇక్కడ ఆగ్రహంగానే ఉన్నారు. సూర్య హీరోగా వచ్చిన కంగువ సినిమాకు మన తెలుగులో భారీగానే థియేటర్లు కొన్ని ప్రాంతాల్లో కేటాయించారు. తెలంగాణలోనే కొన్ని ప్రాంతాల్లో కంగువ సినిమా ఇబ్బందులు పడింది. గతంలో కూడా కమల్ హాసన్ విక్రమ్, అలాగే జైలర్ సహా రజనీకాంత్ సినిమాలకు కూడా మన తెలుగులో భారీగానే థియేటర్ల కేటాయించారు. కానీ మన తెలుగు సినిమాలకు థియేటర్లను కేటాయించే విషయంలో అక్కడ డిస్ట్రిబ్యూటర్లు అలాగే నిర్మాతలు ముందుకు రాకపోవడం పట్ల ఫ్యూచర్లో ఏం చేయాలనే దానిపై మన నిర్మాతలు పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.

Also Read : ఎవరీ వినయ్…? సాక్షి టూ మోహన్ బాబు యూనివర్సిటీ

ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన క సినిమా విషయంలో ఎంత బతిమిలాడిన సరే కనీసం ఒక దియేటర్ కూడా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వలేదు. అలాగే గోపీచంద్ విశ్వం సినిమా విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు అక్కడి నిర్మాతలు. పుష్ప 2 సినిమా విషయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో దియేటర్లు ఇవ్వడానికి అక్కడి నిర్మాతలు అంగీకరించలేదని సమాచారం. అయితే స్టార్ నిర్మాతల సినిమా కాబట్టి కాస్త వెనక్కి తగ్గారని అదే ఏ చిన్న హీరో సినిమా అయితే మాత్రం కచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండేదని అంచనా వేస్తున్నారు. పుష్ప 2 సినిమా విషయంలో కూడా మదురై సహా కొన్ని ప్రాంతాల్లో థియేటర్లను కేటాయించడానికి అక్కడి నిర్మాతలు ముందుకు రాలేదు. మరి భవిష్యత్తులో మన నిర్మతాలు ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్